
వర్షం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చిరు జల్లులు పడుతుంటే, ఆ వాన నీటిలో తడుస్తూ చాలా మంది సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వర్షం పడుతుందంటే చాలు వారు వర్షంలో తడవకుండా అస్సలు ఉండలేరు.

కొందరు ఆనందంగా తడిస్తే మరికొంత మంది పనుల నిమిత్తం వర్షంలో తడవాల్సి వస్తుంది. అయితే ఎలా తడిచినా సరే, ఈ వర్షంలో తడవడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. పెద్ద వారు మాత్రం చిన్నపిల్లలను వర్షంలో తడవకూడదు అనారోగ్య సమస్యలు వస్తాయంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉన్నదంటే?

అయితే వర్షంలో తడవడం ఆరోగ్యానికి మంచిదేనంట. దీని వలన మన మనస్సుకు ప్రశాంతత కలగడమే కాకుండా శరీర ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగు పడుతుందంట. అంతే కాకుండా ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుందంట. శరీరాన్ని, మనసును రీ ఫ్రెష్ చేస్తుందంట. చర్మంపై పేరుక పోయిన దుమ్ము, ధూళిని తెలిగిస్తుంది.

అలాగే వర్షం నీరులో ఆరోగ్యానికి మేలు చేసేవి అనేక ఉంటాయంట. ముఖ్యంగా వర్షపు నీటిలో పీహెచ్ స్థాయి తక్కువగా ఉండటం వలన ఇది శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి.ఇవి మనసుకు, శరీరాన్నికి ఆనందాన్ని కలిగిస్తాయంట. చాలా సంతోషంగా ఉండేలా చేస్తాయంట.

అంతే కాకుండా వర్షపు నీటిలో స్నానం చేయడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి,మనిషిని చాలా యాక్టివ్ చేస్తుందంట. అయితే వర్షపు నీరు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఎక్కువ సేపు వర్షంలో తడవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు.