Pasta: పాస్తా వేడిగా కాదు.. ఫ్రిజ్‌లో ఉంచి 6-7 గంటల తర్వాత తిన్నారంటే..! నమ్మలేని లాభాలు

పాస్తా అనేది కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం. దీనిని పిండి, వెన్న, జున్నుతో తయారు చేస్తారు. బరువు తగ్గే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీనిని తీసుకోకపోవడమే మంచిది. నిజానికి పాస్తా ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? పాస్తాను వేడిగా కాకుండా చల్లగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Pasta: పాస్తా వేడిగా కాదు.. ఫ్రిజ్‌లో ఉంచి 6-7 గంటల తర్వాత తిన్నారంటే..! నమ్మలేని లాభాలు
Cold Pasta Benefits

Updated on: May 27, 2025 | 8:48 PM

మనకు తెలియదుగానీ.. కొన్ని ఆహారాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కానీ రోజువారీ జీవనంలో అన్నింటినీ కలిపేసి భోజనంలో వినియోగిస్తుంటాం. అందుకే ప్రతిరోజూ అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాలి. బెంగళూరు లాంటి నగరాల్లో అల్పాహారంగా పాస్తా తినడం సాధారణం. ఎందుకంటే ఉదయం జాబ్‌కి వెళ్లడం, పిల్లలను త్వరగా పాఠశాలకు పంపడం వంటి పనుల నుంచి టైమ్‌ సేవ్‌ చేయడానికి తక్షణ స్నాక్‌గా కూడా ఇది పని చేస్తుంది. పాస్తా అనేది కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం. దీనిని పిండి, వెన్న, జున్నుతో తయారు చేస్తారు. బరువు తగ్గే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీనిని తీసుకోకపోవడమే మంచిది. నిజానికి పాస్తా ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? పాస్తాను వేడిగా కాకుండా చల్లగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వంటి వివరాలు నిపుణుల మాటల్లో మీకోసం..

పాస్తాలోని గ్లైసెమిక్ కంటెంట్ డయాబెటిస్, బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ మీరు దీనిని ఉడికించి, చల్లబడిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఉంచి ఆ తర్వాత తీసుకుంటే మాత్రం ఆరోగ్యంపై దీని ప్రభావం అంతగా ఉండదు. పాస్తాను ఉడికించి కనీసం 7-8 గంటలు చల్లబరచడం వల్ల అది చాలా ఆరోగ్యకరమైనదిగా మారుతుది. మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మంచిది. పాస్తాను కనీసం 7-8 గంటలు చల్లబరచడం ద్వారా, దానిలోని రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణం కావడం సులభం అవుతుంది. వంటకం మొత్తం కేలరీల సంఖ్యను 30-50% తగ్గిస్తుంది. ఇది ఫైబర్ కంటెంట్‌ను కూడా పెంచుతుంది. ఇది డయాబెటిస్‌తో బాధపడేవారికి, బరువు తగ్గడానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

ఇది చిన్న ప్రేగులలో పిండి పదార్ధం చక్కెరగా విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. దీంతో ఇది నేరుగా పెద్ద ప్రేగులోకి కదులుతుంది. ఇది పేగులోని మంచి బ్యాక్టీరియాను షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (SCFA) ఉత్పత్తి చేయడానికి మరింత ప్రేరేపిస్తుంది. ఇది మొత్తం ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉడికించిన పాస్తాను చల్లబరిచి తీసుకోవడం వల్ల తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. దీని వలన ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణమవుతాయి. భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, బయోటిక్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ఊబకాయం, జీవక్రియ సిండ్రోమ్, గట్ ఆరోగ్యాన్ని నివారించడంలోనూ సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.