Inspiring Story-Mrs. Sudha Murthy: పద్మశ్రీ సుధా మూర్తి ఆర్ నారాయణ మూర్తి భార్య .. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు. కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఓ సంస్థకు యజమాని.. అయితే సంపద పెరిగేకొలదీ మనిషి ఒదిగి జీవించడం ఆమెనుంచి అందరూ నేర్చుకోవాలి. కొన్ని వందల కోట్లకు అధిపతి అయినా సుధామూర్తి.. ఎటువంటి భేషజం లేకుండా నేలమీద కూర్చుంటారు. అంతేకాదు స్వయంగా దేవుడికి పూల మాల కట్టి సమ్పరిస్తారు. ఇక కూరగాయలు కూడా కట్ చేసి.. ఆహారపదార్ధాల తయారీ సమయంలో సాయం అందిస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే.. సంపద వలన వచ్చే అహంకారాన్ని వదిలించుకోవడానికి అని వినయంగా చెప్పే మనసున్న మారాణి సుధామూర్తి. అవును సంవత్సరంలో ఒకరోజు సుధామూర్తి తిరుమల బాలాజీ ఆలయంలో స్వయంగా పూలమాలలు తయారు చేసి శ్రీవారికి సమర్పిస్తారు. అంతేకాదు జయంనగర్‌లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ప్రసాదం కోసం మూడు రోజులు కూరగాయలు కట్ చేస్తారు.
ఇక సంపాదన ఉండగానే సరిపోదు. దానిని సరైన మార్గంలో ఖర్చు చేయాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు తన సంపదను ఖర్చు చేసే దాన గుణం ఉండాలి. ఇవన్నీ సుధామూర్తిలో పుష్కలంగా ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసొచ్చారు సుధామూర్తి. ఒడుదొడుకుల్లోనూ కుదురుగా ఉన్నారు. తన భర్త నారాయణమూర్తి విజయంలో వెనకే ఉన్నారు. భర్తను ముందుకు నడిపించారు. ఒక ఇల్లాలిగా, తల్లిగా అనురాగ సుధలు పంచిన ఆమె.. రచయిత్రిగా ఎందరికో ఆదర్శం. దాతృత్వంలో ఎప్పుడూ ముందుండే సుధామూర్తి.. ఏ విపత్తు వచ్చినా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అండగా ఉంటుందని అనేక సార్లు నిరూపించారు.
ఇక దేశంలో కొవిడ్-19 ఉగ్రరూపు దాలుస్తున్న సమయంలో సుధామూర్తి చేసిన సామజిక సేవలకు వేల కట్టలేం.. బెంగళూరులో ఓ ఆస్పత్రిని నిర్మించారు. వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో ప్రారంభించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రులకు పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర సామగ్రిని కూడా అందించారు. క్వారంటైన్ సెంటర్, ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు ప్రధానమంత్రి సహాయనిధి ‘పీఎం కేర్స్’కు రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. మానవత్వం మూర్తీభవించిన దాన సుధ మూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇక భారత స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సుధా మూర్తి దేశం కోసం ప్రాణాలు అర్పించిన 800 కుటుంబాలకు 10 కోట్లు అక్షరాల పది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు .
సుధా కులకర్ణి మూర్తి.. సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. అంతేకాదు గ్రామీణాభివృద్దికి సహకరింకాహారు. ఇక కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు.
Also Read: రాష్ట్రానికి కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి.. ఇప్పటి వరకూ సొంత ఇల్లు, కారు లేదు.. బ్యాంక్ అప్పులు లేవట..