Indian Toilet Vs Western Toilets: ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్.. ఏది హెల్త్ మంచిది?

ఒకప్పుడు బహిరంగ మల విసర్జన వ్యవస్థ ఉండేది. రాను రానూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో.. బహిరంగ మల విసర్జన అనేది చాలా వరకూ తగ్గింది. ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్ప.. ఎక్కడ చూసినా ఇప్పుడు మరుగు దొడ్ల వ్యవస్థ వచ్చింది. మొదట్లో గ్రామానికి ఓ మరుగు దొడ్ల నిర్మాణం ఉండేది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఎంతో తోడ్పడ్డాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా ఇప్పుడు ఇంటికో బాత్ రూమ్ నిర్మాణాలు వచ్చాయి. ఈ బాత్రూమ్‌‌ల నిర్మాణాల్లో కూడా ఎన్నో కొత్త వెరైటీలు..

Indian Toilet Vs Western Toilets: ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్.. ఏది హెల్త్ మంచిది?
Indian Toilet Vs Western Toilets

Updated on: Mar 12, 2024 | 5:14 PM

ఒకప్పుడు బహిరంగ మల విసర్జన వ్యవస్థ ఉండేది. రాను రానూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో.. బహిరంగ మల విసర్జన అనేది చాలా వరకూ తగ్గింది. ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్ప.. ఎక్కడ చూసినా ఇప్పుడు మరుగు దొడ్ల వ్యవస్థ వచ్చింది. మొదట్లో గ్రామానికి ఓ మరుగు దొడ్ల నిర్మాణం ఉండేది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఎంతో తోడ్పడ్డాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా ఇప్పుడు ఇంటికో బాత్ రూమ్ నిర్మాణాలు వచ్చాయి. ఈ బాత్రూమ్‌‌ల నిర్మాణాల్లో కూడా ఎన్నో కొత్త వెరైటీలు వచ్చాయి. ఇప్పుడు భారత దేశంలో కూడా చాలా వరకూ వెస్ట్రన్ టాయిలెట్ల నిర్మాణానికే మక్కవ చూపిస్తున్నారు. ఇండియన్ టాయిలెట్ల కంటే.. విదేశీ టాయిలెట్ల సంస్కృతినే ఇష్ట పడుతున్నారు. అయితే ఈ వెస్ట్రన్ టాయిలెట్లు సౌకర్యంగా ఉన్నా.. వీటితో నష్టాలు లేకపోలేదు. మరి ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్‌లలో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల..

భారతీయ టాయిలెట్లు ఉపయోగించడం అనేది ఓ వ్యాయమంగా చెప్తారు. కూర్చోవడం, నిలబడటం వల్ల రోజువారీ వ్యాయామం అవుతుంది. ఇండియన్ టాయిలెట్లపై కూర్చోవడం అనేది ఒక చిన్న వ్యాయామ కార్యకలాపం అవుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మీ చేతులు, కాళ్లకు చాలా మంచిది. అంతే కాకుండా జీర్ణ క్రియను కూడా మెరుగు పరుస్తుంది. మీ కడుపుపై ఒత్తిడి తీసుకొచ్చి.. మల విసర్జన సరిగా అయ్యేలా చేస్తుంది. ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించడం వల్ల.. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రసవం.. సాఫీగా, సులువుగా అయ్యేందుకు మార్గం ఉంటుంది.

వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల..

వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడేవారికి ఇది చాలా సౌకర్యవతంగా ఉంటుంది. వీటిని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపయోగిస్తే చాలా ఉపశమనం పొందుతారు. కానీ ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఈ టాయిలెట్ యూజ్ చేయవడం వల్ల.. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. అతి సారం, కడుపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్ చర్మానికి తగలడం వల్ల.. క్రిములు, బ్యాక్టీరియా అనేవి త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తే.. ఎప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్‌గా ఉంచుకునేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..