Late Night Dinner Tips: ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి తినాలి. వేళకు నిద్రపోవాలి. అయితే యాంత్రిక జీవనశైలి, బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది అర్ధరాత్రిళ్లు తింటున్నారు. పైగా ఈ రోజుల్లో లేట్ నైట్ డిన్నర్ ఫ్యాషన్ అయితపోయింది. అయితే ఎప్పుడో ఒకసారి ఆలస్యంగా భోజనం చేస్తే పర్లేదు కానీ అదే అలవాటుగా చేసుకుంటే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. స్థూలకాయం (Obesity) తో పాటు మధుమేహం, కీళ్లనొప్పులు, హైబీపీ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో ఆలస్యంగా రాత్రి భోజనం చేసేవారు మరింత ఆరోగ్యస్పృహతో ఉండాలంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా సమస్యలను చాలా వరకు నివారించవచ్చంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
హడావిడిగా తినద్దు..
కొంత మంది రాత్రిపూట హడావిడితో భోజనం వేగంగా చేస్తుంటారు. ఇలా తినడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ. చాలామంది ఐదు నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే ఏ సమయంలో తిన్నా నిదానంగా, బాగా నమిలిన తర్వాతే మింగాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు కూడా తలెత్తవు.
ఎక్కువగా వద్దు..
కొంతమంది లేట్ నైట్ పార్టీలు, ఫంక్షన్లలో ఎక్కువగా తింటుంటారు. రుచిగా ఉన్నాయని కనిపించినవన్నీ లాగేస్తుంటారు. ఇలా తరచూ తీసుకోవడం ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఊబకాయం సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే రాత్రిపూట హెవీ ఫుడ్ బదులు కిచిడీ వంటి తేలికపాటి ఆహారం, కూరగాయలు, రోటీలను తీసుకోవచ్చు. సలాడ్లు కూడా శరీరానికి మేలు చేకూరుస్తాయి.
అలా చేయద్దు..
కొందరు రాత్రిపూట తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, రక్తంలో చక్కెర వంటి సమస్యలు తలెత్తుతాయి. అజీర్తి, అసిడిటీ, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు తరచు ఇబ్బంది పెడతాయి. అందుకే రాత్రివేళల్లో తిన్న తర్వాత కొద్ది సేపు వాకింగ్ చేయాలంటున్నారు నిపుణులు.
Also Read: NIPER JEE 2022 నోటిఫికేషన్ విడుదల! పరీక్ష ఎప్పుడంటే..
Vinay Rai: త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్ లవ్‌బర్డ్స్.. హీరోయిన్‌ను పెళ్లిచేసుకోబోతున్న ఆ హ్యాండ్సమ్ హీరో..
S. S. Rajamouli: అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి రచ్చ.. నాటు నాటు పాటకు స్టెప్పులేసిన జక్కన్న..