గురకకు గుడ్ బై.. ఖరీదైన మందులు అక్కర్లేదు.. ఇంట్లోని ఈ పదార్థాలతో చెక్ పెట్టండి..

గురక పెట్టేవారికి అది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు కానీ అది వారి శరీరంలో పొంచి ఉన్న తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. అంతేకాదు మీ పక్కన పడుకునే వారి నిద్రను ఇది నరకం చేస్తుంది. దీనిని కేవలం ఒక జోక్ లాగానో లేదా సాదాసీదా విషయంగానో విస్మరిస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

గురకకు గుడ్ బై.. ఖరీదైన మందులు అక్కర్లేదు.. ఇంట్లోని ఈ పదార్థాలతో చెక్ పెట్టండి..
How To Stop Snoring Naturally

Updated on: Feb 24, 2026 | 10:01 PM

గతంలో గురక అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్య అనుకునేవారు. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ సమస్య వేధిస్తోంది. గురక పెట్టేవారికి అది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు కానీ పక్కన పడుకునేవారి నిద్రకు అది పెద్ద నరకం. అయితే గురకను కేవలం ఒక జోక్‌గా చూడకూడదని, ఇది తీవ్రమైన శారీరక సమస్యలకు సంకేతమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు గురక ఎందుకు వస్తుంది?

మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు గొంతు కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. దీనివల్ల వాయుమార్గం ఇరుకుగా మారుతుంది. గాలి లోపలికి, బయటకు వెళ్లేటప్పుడు గొంతులోని మృదువైన కణజాలాలు కంపించడం వల్ల గురక శబ్దం వస్తుంది. ఒకవేళ ఈ గాలి మార్గం పూర్తిగా మూసుకుపోతే శ్వాస కొన్ని క్షణాలు ఆగిపోతుంది. దీన్నే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. దీనివల్ల గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గురకను తగ్గించే అద్భుతమైన ఇంటి నివారణలు..

మీరు ఈ సమస్య నుండి బయటపడటానికి ఖరీదైన మందులు అక్కర్లేదు, ఇంట్లో ఉండే ఈ వస్తువులతో సులభంగా ఉపశమనం పొందవచ్చు..

ఆవ నూనె మసాజ్: పడుకునే ముందు కొద్దిగా వేడి చేసిన ఆవ నూనెను ముక్కు వెలుపల రెండు నిమిషాలు, మెడ, దవడ కింద ఐదు నిమిషాలు మసాజ్ చేయండి. ఇది వాయుమార్గాన్ని ఫ్రీగా చేసి శ్వాస సులభంగా ఆడేలా చేస్తుంది.

ఉప్పు, పసుపుతో పుక్కిలించడం: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాతి ఉప్పు, చిటికెడు పసుపు కలిపి పడుకునే ముందు పుక్కిలించండి. ఇది గొంతులో ఉన్న వాపును తగ్గించి గురకను అదుపు చేస్తుంది.

తేనె – నల్ల మిరియాలు: ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనెలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి నిద్రపోయే ముందు తీసుకోండి. ఇది గొంతులో శ్లేష్మాన్ని తగ్గించి, శ్వాసను మృదువుగా మారుస్తుంది.

Follow Us