ఎంత రుద్దినా కాలర్‌పై మొండి మరకలు పోవట్లేదా? ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో మాయం చేయండి!

ప్రతి ఇంట్లో మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే.. బట్టలు ఉతికేప్పుడు.. షార్ట్‌ కాలర్‌పై ఉన్న మరకలను తొలగించడం. దీన్ని ఎంత గట్టిగా రుద్దినా, ఎన్ని సార్లు ఉతికినా కొన్ని సార్లు కాలర్‌పై ఉన్న మరకలు పోవు. అలాంటి వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలను తీసుకొచ్చాం. ఈ చిట్కాలు ఉపయోగించి మీరు ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా కాలర్‌పై ఉన్న మురిని తొలగించవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

ఎంత రుద్దినా కాలర్‌పై మొండి మరకలు పోవట్లేదా? ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో మాయం చేయండి!
How To Remove Stubborn Shirt Collar Stains

Updated on: May 31, 2026 | 8:44 PM

సాధారణంగా బట్టలపై ఉండే మరకలను తొలగించడం సులభమే, కానీ షర్ట్ కాలర్‌పై ఉండే మొండి మరకలను వదిలించడం అంత సులువు కాదు. కాలర్ నిరంతరం మెడకు తగులుతూ ఉండటం వల్ల చెమట, చర్మం నుండి వచ్చే నూనెలు, ధూళి, మురికి కాలర్‌కు పేరుకుపోతాయి. ఈ మరకలు అంత త్వరగా వదలవు. వీటిని వదిలించడానికి కాలర్‌ను గట్టిగా రుద్దితే, బట్టలు త్వరగా అరిగిపోయి, పాతవాటిలా కనిపిస్తాయి. అందుకే, కొన్ని సాధారణ ఇంటి చిట్కాల సహాయంతో షర్ట్ కాలర్‌పై ఉన్న మొండి మరకలను సులభంగా తొలగించవచ్చు.

కాలర్ మరకలను వదిలించే అద్భుతమైన చిట్కాలు

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం: కాలర్ పై మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం 2 చెంచాల బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను కాలర్‌పై మరకలు ఉన్న చోట రాసి, పాత టూత్ బ్రష్ సహాయంతో మెల్లగా స్క్రబ్ చేయండి. 15-20 నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. అంతే కాలర్‌పై ఉన్న మొండి మరలు మాయమైపోతాయి.

వైట్ వెనిగర్, డిటర్జెంట్: కాలర్‌కు పట్టిన పాత, నల్లటి లేదా పసుపు రంగు మొండి మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్, డిటర్జెంట్ బాగా సహాయపడతాయి. కాలర్‌పై కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి, దానిపై 1-2 చెంచాల వైట్ వెనిగర్ పోయండి. దీన్ని 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత బ్రష్‌తో మెల్లగా రుద్దండి. ఇది మరకలను సులభంగా తొలగిస్తుంది.

డిష్‌వాష్ లిక్విడ్, షాంపూ: ఇది కూడా మొండి మరకలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్, అంతే పరిమాణంలో షాంపూ కలిపి మిశ్రమంలా చేయండి. దీన్ని నేరుగా షర్ట్ కాలర్‌కు రాయండి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై బ్రష్‌తో స్క్రబ్ చేసి శుభ్రం చేయండి. ఇది జిడ్డు లాంటి మొండి మరకలను కూడా సులభంగా వదిలిస్తుంది.

కాలర్ మరకలను శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

  • కాలర్ మరకలను శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే బట్టలు త్వరగా చిరిగిపోయే లేదా పాడైపోయే అవకాశం ఉంది.
  • బ్రష్‌తో కాలర్‌ను ఎప్పుడూ గట్టిగా రుద్దకూడదు; దీనివల్ల బట్ట డ్యామేజ్ అవుతుంది.
  • రంగుల షర్టులపై నిమ్మరసం లేదా బ్లీచ్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • పై చిట్కాలను ఉపయోగించే ముందు, బట్టల లోపలి భాగంలో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఒకవేళ బట్ట రంగు వెలిసిపోతున్నట్లు అనిపిస్తే, ఆ చిట్కాలను వాడకండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us