Parenting Tips: పిల్లలు ఫోన్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న పిల్లలకు స్మార్ట్‌ ఫోన్ ఇస్తున్నారు. ఇలా చేయడం పెద్ద తప్పు. పిల్లలు ఈ ఫోన్‌ లకు బానిసలు కావడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే చిన్న వయసులోనే వారికి ఫోన్ అలవాటు చేయడం మానేయండి. పండుగలు, సెలవులు, లేదా ఆటలు ఆడే సమయాల్లో మాత్రమే స్మార్ట్‌ ఫోన్ వాడుకునే అవకాశం ఇవ్వడం మంచిది. దీన్ని పాటించడం ద్వారా పిల్లలు మొబైల్ ఫోన్‌ లకు దూరంగా ఉండే అలవాటు చేసుకుంటారు.

Parenting Tips: పిల్లలు ఫోన్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!
Kids Screen Time

Updated on: May 30, 2025 | 7:16 PM

తల్లిదండ్రులు పిల్లలలో క్రియేటివిటీ పెంచే పనులు చేయించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు చిత్రకళ, చేతి పనులు, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, వంట చేయడం వంటి వివిధ సృజనాత్మక పనులలో పాల్గొనమని వారిని ప్రోత్సహించండి. ఇలాంటి పనులు పిల్లల మనసును ఆకర్షించి వారి ఆలోచన శక్తిని పెంచుతాయి. ఫోన్ ఆటల కంటే ఈ రకమైన సృజనాత్మక కార్యకలాపాలు పిల్లలకు ఎక్కువ ఉపయోగపడతాయి.

పిల్లలు ఎక్కువగా బయట ఆడటానికి ప్రోత్సహించాలి. పార్కుల్లో ఆడటం, తోటలో మొక్కలు నాటడం, పెంపుడు జంతువులతో సమయం గడపడం వంటి పనులు వారికి సహాయపడతాయి. ఈ విధంగా పిల్లలు సహజసిద్ధమైన ఆటలతో ఆరోగ్యంగా ఫిట్‌ గా ఉండటానికి అవకాశం ఉంటుంది. దాంతో ఫోన్‌ ల పట్ల వారి ఆకర్షణ తగ్గిపోతుంది.

పిల్లలు పెద్దల అలవాట్లను చూసి నేర్చుకుంటారు. మీరు ఫోన్ వాడకపోవడం లేదా తక్కువ వాడటం చూపిస్తే పిల్లలు కూడా దాన్ని గమనించి అనుసరిస్తారు. అందు వల్ల తల్లిదండ్రులు ముందుగా తమ ఫోన్ అలవాట్లను తగ్గించుకోవడం అవసరం. పిల్లల ముందు ఫోన్‌ ల వాడకం తగ్గిస్తే వారు కూడా ఫోన్‌ ల నుంచి దూరంగా ఉంటారు.

పిల్లలకు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఫోన్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదాహరణకు రోజుకు ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్ అనుమతించండి. ఆ సమయం తర్వాత వారితో మాట్లాడి ప్రశాంతంగా ఫోన్ తీసుకోవడం మంచిది. ఈ విధంగా స్క్రీన్ టైమ్ నియంత్రణ మరింత సులభం అవుతుంది.

పిల్లలు ఫోన్ అడగకుండా ఉండాలంటే ఇంట్లో ఆటలు, క్రాఫ్ట్స్, వంట వంటివి చేయించండి. పిల్లలు చేతులతో చేసే పనుల్లో ఇష్టపడితే వారి దృష్టి ఫోన్‌ ల నుండి మళ్ళిపోతుంది. వంట పని చేయడం వల్ల పిల్లలలో తమ పని తాము చేసుకోవడం, బాధ్యత భావం కూడా పెరుగుతుంది.

మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వారికి బోర్ కొట్టకుండా చేస్తుంది. ఈ సమయాల్లో వారితో కథలు చెప్పడం, ఆడటం, సరదాగా మాట్లాడటం వంటి పనులు చేయండి. అందు వల్ల పిల్లలకు ఫోన్ చూడాలన్న ఆలోచన తక్కువగా వస్తుంది.

అవసరం లేని సమయాల్లో ఇంటర్నెట్ ఆపేయడం ద్వారా పిల్లలు ఫోన్‌ లు, టీవీల నుంచి దూరంగా ఉంటారు. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల వారు చదువు, ఆటలు, ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టగలుగుతారు. దీనితో ఫోన్‌ పై ఆధారపడటం తగ్గుతుంది.

పిల్లల సామాజిక నైపుణ్యాలను పెంచడానికి వారిని తోటి పిల్లలతో కలిసి ఆడేలా ప్రోత్సహించాలి. దీని వల్ల వారు ఫోన్‌కు అతుక్కుపోకుండా ఆనందంగా, ఆరోగ్యంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి ఆడుకోవడం వల్ల ఫోన్‌ కు దూరంగా ఉంటారు.

పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌ లకు బానిసలు కాకుండా చూసుకోవాలంటే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే వారికి సమతుల్యమైన జీవనశైలిని అలవాటు చేయాలి. అలాగే ఫోన్‌ లను ఎంత వరకు వాడాలి అనేదానిపై సరైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇది పిల్లలను ఫోన్ అలవాట్లలో పడకుండా కాపాడుతుంది.