
రాగులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా వేసవిలో ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనంగా ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలంలో వేడి కారణంగా మన త్వరగా నీరసంగా మారిపోతాం. అలాంటి సమయంలో రాగి జావా వంటిది తాగుతే మన ఇన్‌స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. రాగుల్లో ఉండే పోషకాలు మనకు తక్షణ శక్తిని అందించడంతో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే రాగులను చాలా మంది రాగి సంకటి, లేదా రాగి ఇడ్లీ రూపంలో ఆహరంలో చేర్చుకుంటారు. ఇవే కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి క్రిస్పీ క్రిస్పీగా ఉండే రాగి రవ్వ దోష చేసుకుంటే మీ బ్రేక్‌ఫాస్ట్ మరింత హెల్దీగా ఉంటుంది. మేం చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే టేస్టీ అండ్ హెల్తీగా ఉంటే రాగి రవ్వ దోషను ఈజీగా తయారు చేసుకోవచ్చు.
రాగి రవ్వ దోషకు కావాల్సిన పదార్థాలు
రాగి దోశకు కావాల్సి పదార్థాలలో ఇవే రెండు కప్పుల రాగి పిండి, రెండు కప్పుల బొంబాయి రవ్వ, ఒక కప్పు గోధుమపిండి, రుచికి సరిపడ ఉప్పు, అర టీస్పూన్ ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు, రెండు టీస్పూన్‌ల జిలకర్ర, రెండు స్పూన్‌ల మిరియాలు, కొన్ని పచ్చిమిర్చి, రెండు లీటర్ల పచ్చని మజ్జిగ ఇవి ఉంటే సరిపోతుంది.
రాగి రవ్వ దోశ తయారీ విధానం
రాగి రవ్వ దోశ కోసం ముందుగా మన ఒక పెద్ద గిన్నే తీసుకొని అందులో రాగి పిండి, బొంబాయి రవ్వ, గోధుమపిండి వేసుకోవాలి. వాటిపైనే రుచికి సరిపడ ఉప్పు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు తరుము, ముందుగా రుబ్బుకున్న మిరియాలు, పచ్చిమిర్చి పేస్ట్‌ను యాడ్ చేసుకోవాలి. తర్వాత నీటికి బదులుగా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను కొద్దిగా యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత దాన్ని 25 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టాలి.
తర్వాత ఒక వేళ మీరు పెట్టిన పిండి గట్టిగా అనిపిస్తే అందుతో కాస్తా వాటర్ పోసి దోశకు కవాల్సిన విదంగా పలుచగా కలుపుకోండి. తర్వాత దోశ పెంచు తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. పెనం అన్ని వైపులా వేడి అయిన తర్వాత దానిపై కొంచెం నూనె యాడ్ చేసి దానిపై సన్నగా తరిగి ఉల్లిపాయను కాస్తా వేసుకోండి తర్వాత మీరు ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్న పండిని పెనంపై అన్ని వైపులా వచ్చేలా దోశలా పోసుకోండి.
తర్వాత అది పెనానికి అత్తుకు పోకుండా అంచులవైపున, మధ్యలో కాస్తా అయిల్ వేసి అన్ని మూలల బాగా కాలేలా జరుపుకోండి. ఇలా కాల్చడం ద్వారా మీకు దోశ అన్ని వైపులా ఒకేలా క్రిస్పీగా కాలుతుంది. దోశ క్రిస్పీగా రెడీ అయిన తర్వాతా దాన్ని దోశ స్పూన్ సహాయంతో ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే టేస్టీ టేస్టీ, అండ్ హెల్డీగా ఉండే క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయినట్టే. దానిని ఒక చట్నీతో కలిపి తింటే అదిరిపోతుంది అంతే.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.