
ఈ ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల నేడు చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్. జిమ్‌లో గంటల తరబడి కష్టపడినా, కఠినమైన డైటింగ్ చేసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం ఉండదు. అయితే ఆయుర్వేదం ప్రకారం.. మన వంటింట్లో ఉండే కొన్ని అద్భుతమైన పదార్థాలతో రాత్రిపూట కూడా కొవ్వును కరిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో జీవక్రియను వేగవంతం చేసే సహజ పానీయాలు తీసుకుంటే, శరీరం అంతర్గతంగా శుభ్రపడటమే కాకుండా.. కొవ్వు కరిగించే ప్రక్రియ రాత్రంతా నిరంతరాయంగా కొనసాగుతుంది.
ఈ డ్రింక్‌ను రాత్రి పడుకోవడానికి 30 నుండి 40 నిమిషాల ముందు తాగాలి. తాగిన తర్వాత మళ్లీ ఏమీ తినకూడదు. ఈ డ్రింక్ వల్ల నిద్రలో మందగించే జీర్ణ వ్యవస్థను ఇది చురుగ్గా ఉంచుతుంది. ఉదయాన్నే కడుపు సాఫీగా అయ్యేలా చేసి, తేలికగా అనిపించేలా చేస్తుంది. జీలకర్ర ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల కొత్తగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు లేదా పాటించే ముందు వైద్యులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..