దెబ్బకు ఎలుకలన్నీ పరార్.. వంటగదిలోని ఈ వస్తువులతో సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయా..? బట్టలు, ఆహారం నాశనం చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారా..? విషం పెట్టకుండా, రసాయనాలు వాడకుండానే ఎలుకలను మీ ఇంటి నుండి శాశ్వతంగా తరిమికొట్టే సులభమైన సహజ చిట్కాలు గురించి తెలుసా..? కేవలం మీ వంటగదిలో ఉండే పదార్థాలతోనే వీటిని వదిలించుకోవచ్చు..

దెబ్బకు ఎలుకలన్నీ పరార్.. వంటగదిలోని ఈ వస్తువులతో సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
How To Get Rid Of Rats Naturally

Updated on: Feb 27, 2026 | 9:17 PM

వేసవి కాలం రాగానే ఆహారం, నీరు వెతుక్కుంటూ ఎలుకలు ఇళ్లలోకి ప్రవేశించడం సర్వసాధారణం. ఇవి డబ్బాల్లోని ఆహార పదార్థాల నుండి బట్టల వరకు ప్రతిదీ నాశనం చేస్తాయి. చాలామంది ఎలుకలను చంపడానికి విషం పెడుతుంటారు లేదా పిల్లులను పెంచుతుంటారు. కానీ రసాయనాలను ఉపయోగించకుండానే సహజమైన పద్ధతిలో ఎలుకలను ఇంటి నుండి తరిమికొట్టవచ్చని మీకు తెలుసా..? ఎలుకలకు వాసన చూసే శక్తి చాలా ఎక్కువ. కొన్ని బలమైన వాసనలను అవి తట్టుకోలేవు. వాటిని ఉపయోగించి ఎలుకలను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సహజమైన చిట్కాలు

పిప్పరమింట్ ఆయిల్

ఎలుకలకు పిప్పరమింట్ వాసన అస్సలు పడదు. కాటన్ బాల్స్ తీసుకొని వాటికి పిప్పరమింట్ ఆయిల్ రాసి ఎలుకలు తిరిగే ప్రదేశాలు, కిటికీలు, తలుపుల దగ్గర ఉంచండి. ఈ ఘాటైన వాసనకు అవి వెంటనే పారిపోతాయి.

ఉల్లిపాయలు

ఎలుకలు ఉల్లిపాయల ఘాటైన వాసనను కూడా ఇష్టపడవు. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి ఎలుకలు వచ్చే ప్రదేశంలో పెట్టండి. అయితే ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి వాటిని మారుస్తూ ఉండాలి.

బేకింగ్ సోడా

ఎలుకలను తరిమికొట్టడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం. బేకింగ్ సోడాను కొద్దిగా పిండి లేదా చక్కెరతో కలిపి ఎలుకలు సంచరించే ప్రదేశాలలో ఉంచండి. చక్కెర వాసనకు ఆకర్షితులై ఎలుకలు దీనిని తింటాయి. ఇది వాటి జీర్ణవ్యవస్థలో వాయువును ఉత్పత్తి చేసి, వాటిని బయటకు పారిపోయేలా చేస్తుంది.

కారంపొడి

కారం పొడి ఎలుకలను బాగా భయపెడుతుంది. ఎలుకలు వచ్చే రంధ్రాల దగ్గర కారం పొడిని చల్లడం వల్ల, అవి ఇంట్లోకి రావడానికి భయపడతాయి.

నివారణ చర్యలు

  • ఎలుకలను ఇంట్లోకి రాకుండా చూసుకోవడం ఉత్తమం..
  • ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పాత ఫర్నిచర్ మరియు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి.
  • ఆహార పదార్థాలను గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయడం వల్ల ఎలుకలు ఆకర్షితం కావు.
Follow Us