
చిన్న ఈగలు… ఈ పేరు వినగానే చికాకు వస్తుంది. పరిమాణంలో చిన్నగా ఉన్నా, ఇవి సృష్టించే సమస్య పెద్దది. మన ఇల్లు, పెరడు ఇలా ఎక్కడైనా సులభంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. ముఖ్యంగా, మొక్కలకు ఎక్కువ నీళ్లు పోసినా, పండ్లను బయట ఉంచినా, మురికి కాలువలను శుభ్రం చేయకున్నా ఇవి వేగంగా సంతానోత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని వెంటనే నివారించడం చాలా ముఖ్యం. ఈ చిన్న ఈగలను తరిమికొట్టడానికి నిపుణులు అందించిన చిట్కాలు, ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన పద్ధతులు తెలుసుకుందాం.
వెనిగర్ ట్రాప్: ఇది ఒక సులభమైన ఇంటి చిట్కా. ఒక గిన్నెలో కొంచెం ఆపిల్ సైడర్ వెనిగర్, కొన్ని చుక్కల డిష్ సోప్ కలిపి ఉంచాలి. సోప్ వెనిగర్ ఉపరితల ఉద్రిక్తతను తగ్గిస్తుంది, దీంతో ఈగలు మునిగిపోతాయి.
నీటిని వేడిచేసి పోయండి: మీ ఇంట్లో ఉన్న డ్రైన్ పైపులలో చిన్న ఈగలు ఉంటే, వేడి నీళ్లు పోసి వాటిని నివారించవచ్చు. ఇది గుడ్లను, లార్వాను చంపేస్తుంది.
బుగ్ జాపర్: ఈ పరికరాలు UV లైట్ ఉపయోగించి ఈగలను ఆకర్షిస్తాయి. ఆ తర్వాత వాటిని పట్టిస్తాయి లేదా చంపుతాయి.
స్ప్రే వాడండి: కొన్ని రకాల స్ప్రేలు ఈగలను నివారించగలవు. స్ప్రే కొనడానికి ముందు దానిపై సూచనలను జాగ్రత్తగా చదవండి.
ఆల్కహాల్ ట్రాప్ : పండ్లు తినే ఈగలు పాత బీరు, వైన్ వాసనలకు ఆకర్షింపబడతాయి. అటువంటి పానీయం ఉన్న సీసాను బయట ఉంచితే, ఈగలు అందులో చిక్కుకుంటాయి.
స్టికీ ట్రాప్స్: ఈగలు పసుపు రంగులకు ఆకర్షింపబడతాయి. కాబట్టి స్టికీ ట్రాప్స్ ఉపయోగించి వాటిని పట్టుకోవచ్చు.
నీటిని నిలువకుండా చూడండి: ఈగలు నీటిలో గుడ్లు పెడతాయి. అందువల్ల, కుండలలో లేదా ఇతర చోట్ల నీటిని నిలువకుండా చూసుకోండి.
చెత్తాచెదారం తొలగించండి: పడిపోయిన ఆకులు, పండ్లు, ఇతర చెత్తను వెంటనే తొలగించండి.
చెత్త డబ్బాలకు మూత పెట్టండి: బయట చెత్త డబ్బాలకు గట్టిగా మూత పెట్టండి.
ఈ చిన్నచిన్న మార్గాలు పాటిస్తే, మీ ఇంటిని ఈగల నుంచి కాపాడుకోవచ్చు