
కాలం ఏదైనా సరే.. ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది. బయట గాలి కారణంగా ఇంట్లోని కిటికీలు, తలుపులు, గోడలపై విపరీతంగా దుమ్ము చేరుతుంది. ఈ దుమ్ము మంచం, సోఫాల కిందకు కూడా చేరుతుంది. ఇంటిని ప్రతి రోజూ శుభ్రం చేసినా, మంచం కింద, సోఫాల కింద శుభ్రం చేయడం కష్టం. అందుకే వీటి కింద దుమ్ము అనేది విపరీతంగా పేరుకుపోతుంది.

మంచం, సోఫాల కింద ఉండే దుమ్మును క్లీన్ చేయాలంటే.. చాలా ఓపిక కావాలి. ఎందుకంటే వీటి కిందకు వెళ్లి క్లీన్ చేసేంత ప్లేస్ ఉండదు. కాబట్టి కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో మీరు వీటిని ఈజీగా క్లీన్ చేయవచ్చు.

మంచం, టేబుల్, సోఫాల కిందకు అన్నీ దూరవు. కాబట్టి వైపర్‌కు ఏదైనా క్లాత్ చుట్టి క్లీన్ చేయాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని సర్ఫ్ వాటర్‌లో నబెట్టండి. అందులో నుంచి క్లాత్ తీసి పిండి.. వైపర్‌కు చుట్టండి. దీంతో మంచం, సోఫాల కింద క్లీన్ చేయండి.

అదే విధంగా గోనె సంచులతో కూడా మంచం, టేబుల్స్, సోఫాల కింద శుభ్రం చేయవచ్చు. ఇవి చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి నేల త్వరగా క్లీన్ అవుతుంది. ముందుగా డిటెర్జెంట్ వాటర్‌లో ముంచి పొడువాటి కర్ర లేదా వైపర్‌కి కట్టి.. క్లీన్ చేయండి. దుమ్ము, మురికి శుభ్రంగా వచ్చేస్తాయి.

మీరు స్క్రబ్బర్ తో కూడా మంచం, సోఫా, టేబుల్స్ కింద ఉండే మురికిని క్లీన్ చేయవచ్చు. ముందుగా వైపర్ లేదా కర్రకు క్లాత్ కట్టి క్లీన్ చేశాక.. స్క్రబ్బర్‌తో రుద్దండి. ఇలా చేస్తే.. మీ ఫ్లోర్ తెల్లగా మెరుస్తుంది.