Summer Cool Foods: సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!

వేసవి కాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేసవి కాలం వచ్చేస్తుంది అంటేనే జనం హడలిపోతారు. ఎండ, ఉక్కపోత, వేడి కారణంగా ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. వేడి కారణంగా చాలా మందికి చెమట కాయలు వస్తాయి. దీంతో మరింత చికాకుగా ఉంటుంది. ఇలాంటి సమ్మర్‌లో కూడా మీరు కూల్‌గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్‌ని అస్సలు మిస్ చేయకండి. మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీరు తినే ఆహారంతోనే..

Summer Cool Foods: సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
Summer Cool Foods
Follow us

|

Updated on: Apr 30, 2024 | 2:52 PM

వేసవి కాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేసవి కాలం వచ్చేస్తుంది అంటేనే జనం హడలిపోతారు. ఎండ, ఉక్కపోత, వేడి కారణంగా ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. వేడి కారణంగా చాలా మందికి చెమట కాయలు వస్తాయి. దీంతో మరింత చికాకుగా ఉంటుంది. ఇలాంటి సమ్మర్‌లో కూడా మీరు కూల్‌గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్‌ని అస్సలు మిస్ చేయకండి. మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీరు తినే ఆహారంతోనే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. మరి ఇంత హాట్ హాట్ సమ్మర్‌లో.. శరీరాన్ని చల్లబరిచే కూల్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

తాటి ముంజలు:

తాటి ముంజలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. తాటి ముంజలు కూడా ఎక్కువగా వేసవి కాలంలోనే లభ్యమవుతాయి. తాటి ముంజల్లో వాటర్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి ఇవి తింటే శరీరంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే శరీరం కూడా చల్లబడుతుంది.

కొబ్బరి నీరు:

కొబ్బరి నీటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొబ్బరి నీటిలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. వేసవి కాలంలో ఎక్కువగా కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా శరీరం అనేది కూల్ అవుతుంది. దీంతో వేడి, ఉక్కపోత కారణంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కొబ్బరి నీటిని తాగడం మిస్ చేయకండి.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ:

వేసవిలో ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌లో పుచ్చకాయ కూడా ఒకటి. వీటిని అందరూ ఇష్ట పడి తింటారు. ఇందులో కూడా ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి.

స్వీట్ కార్న్:

వేసవిలో స్వీట్ కార్న్ తిన్నా శరీరానికి చాలా మంచిది. స్వీట్‌ కార్న్‌లో ఎక్కువగా నీరు, ఇతర పోషకాలు ఉంటాయి. కాబట్టి స్వీట్ కార్న్ తింటే.. శరీరాన్ని కూల్ అవ్వడమే కాకుండా.. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

ఆరెంజెస్:

ఆరెంజెస్‌ కూడా ఆరోగ్యానిలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి కండరాల నొప్పులు, తిమ్మిర్లు తగ్గిస్తాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.కి చాలా మంచిది. ఇందులో కూడా నీటి శాతం మెండుగా ఉంటుంది.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చీమనే కదా అని లైట్ తీసుకోకండి... జీవితానికి సరిపోయే సందేశం ఉంది
చీమనే కదా అని లైట్ తీసుకోకండి... జీవితానికి సరిపోయే సందేశం ఉంది
అబ్బబ్బ.! చల్లటి కబురు.. వచ్చే ౩ రోజులు ఫుల్ వర్షాలు..
అబ్బబ్బ.! చల్లటి కబురు.. వచ్చే ౩ రోజులు ఫుల్ వర్షాలు..
బెంగళూరు రేవ్‌ పార్టీలో నటి హేమ ఉన్నారా? లేదా?
బెంగళూరు రేవ్‌ పార్టీలో నటి హేమ ఉన్నారా? లేదా?
మీరు తినే బాదం అసలివేనా.. నకిలీవా.? ఇలా తెలుసుకోండి..
మీరు తినే బాదం అసలివేనా.. నకిలీవా.? ఇలా తెలుసుకోండి..
ఊరికి నష్టం.. ఆయనకు మాత్రం ప్రయోజనం.. చివరికి..!
ఊరికి నష్టం.. ఆయనకు మాత్రం ప్రయోజనం.. చివరికి..!
ఓ యువతి చేసిన పనికి రిస్క్‌లో 200 మంది ప్రాణాలు! అసలేం జరిగిందంటే
ఓ యువతి చేసిన పనికి రిస్క్‌లో 200 మంది ప్రాణాలు! అసలేం జరిగిందంటే
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు