Cleaning Tips: షవర్‌లో నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో క్లీన్ చేసుకోండి
Fix Low Shower Pressure: మీ బాత్‌రూమ్‌లో షవర్ వాటర్ సరిగ్గా రావట్లేదా.. వచ్చినా చాలా నెమ్మదిగా వస్తున్నాయా? దాన్ని మార్చేసి కొట్ట షవర్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారా? ఆగండి తొందరపడొద్దు.. మేం చెప్పే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే మీరు ఈజీగా మీ షవర్‌ను క్లీన్ చేసిన వాటర్ ప్రెజర్‌ను పెంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

ఒకప్పుడంటే స్నానం చేయడానికి బకెట్,జగ్గును ఉపయోగించారు. కానీ ప్రస్తుతం అందరి ఇళ్లలో స్నానం చేయడానికి షెవర్‌ను వాడుతున్నారు.అయితే కొన్ని సార్లు షవర్ నుంచి వచ్చే వాటర్ ప్రెజర్ తగ్గి నీళ్లు సరిగా రావు. ఇందుకు ప్రధాన కారణం.. షవర్‌లో ఏర్పడే తెల్లటి పొర. వేడి నీళ్లు, నీటిలోని ఉప్పు, దుమ్ము, మలినాల కారణంగా షవర్ హెడ్‌పై ఒక తెల్లటి సున్నపు పొర ఏర్పడుతుంది. ఇది నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ప్రెజర్‌ను తగ్గిస్తుంది. చాలా మంది దీన్ని ఎలా క్లీన్ చేయాలో తెలియక ఏకంగా షవర్‌నే మార్చేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ షవర్ హెడ్‌ను ఈజీగా క్లీన్ చేయవచ్చు. అదెలానో చూద్దాం.
బాత్రూమ్ షవర్‌లో నీటి వేగం తగ్గడానికి కారణం ఎప్పుడూ పైప్‌లైన్ లీకేజ్ మాత్రమే కాదు.. నీటిలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కాలక్రమేణా ఈ రంధ్రాల్లో పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అప్పుడు దీన్ని క్లీన్ చేసేందుకు చాలామంది వెనిగర్ లేదా బేకింగ్ సోడా వాడతారు, కానీ ఇవి పెద్దగా పనిచేయవు. దానికి బదులు సిట్రిక్ యాసిడ్‌ను వాడడం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
సిట్రిక్ యాసిడ్‌తో షవర్‌ను ఎలా శుభ్రం చేయాలి?
- మీ బాత్‌రూమ్‌లోని షవర్‌ను క్లీన్ చేయడానికి మార్కెట్ నుంచి సిట్రిక్ యాసిడ్‌ను కొనుగోలు చేయండి.
- ముందుగా ఒక పాత్రలో కొన్ని గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో 2 నుండి 3 పెద్ద చెంచాల సిట్రిక్ యాసిడ్ వేయండి.
- ఈ మిశ్రమాన్ని బాగా కలిపి షవర్ హెడ్‌ను విప్పి, ఆ ద్రావణంలో 30 నిమిషాల నుంచి 1 గంట పాటు నానబెట్టండి.
- ఒక వేళ షవర్ హెడ్ విప్పడం కుదరకపోతే, ఆ ద్రావణాన్ని ఒక ప్లాస్టిక్ కవర్‌లో పోసి, షవర్ హెడ్‌కు తగిలించి రబ్బర్ బ్యాండ్ లేదా తాడుతో కట్టేయండి.
- గంట తర్వాత పాత టూత్‌బ్రష్‌తో రంధ్రాల దగ్గర తేలికగా రుద్దండి.
- తర్వాత మళ్లీ ఒకసారి మంచినీటితో కడిగి బిగించండి అంతే మీ షవర్ క్లీన్ అయినట్టే!
మళ్లీ పేరుకుపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ ఇంట్లో షవర్‌లో మళ్లీ ఇలా సున్నపు పొర పేరుకు పోకుండా ఉండాలంటే దాన్ని వారానిరి ఒకసారి లేదా నెలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉండండి. అలాగే స్నానం చేసిన తర్వాత షవర్‌ను పొడిగా ఉంచేలా చూడండి. రంధ్రాలు మూసుకుపోతున్నట్లు అనిపించిన వెంటనే క్లీన్ చేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
