AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..? మెదుడులో జరిగేది ఇదే..

రీల్స్, షార్ట్స్ వంటి షార్ట్‌ఫార్మ్‌ వీడియోలను ఎక్కువగా చూడటం మెదడులో ఏకాగ్రత, స్వీయ నియంత్రణకు సంబంధించిన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఓ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా ప్రీఫ్రంటల్‌ ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ కంట్రోల్‌ సామర్థ్యం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే రీల్స్ చూడటం వల్లే ఏకాగ్రత తప్పకుండా దెబ్బతింటుందని నిర్ధారించలేమని, మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..? మెదుడులో జరిగేది ఇదే..
Insta Reels
Janardhan Veluru
|

Updated on: Aug 22, 2026 | 12:25 PM

Share

ప్రస్తుతం అన్ని వయస్కుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటి షార్ట్‌ఫార్మ్‌ వీడియోలు కీలక భాగంగా మారిపోయాయి. రోజూ వినోదం కోసం ఐదు నిమిషాలు షార్ట్ వీడియోలు చూద్దామనుకుని స్టార్ట్ చేస్తే.. గంటల తరబడి అందులోనే మునిగిపోతున్నారు. కొందరిలో షార్ట్ వీడియోలు చూడటం అలవాటుగా మొదలై వ్యసనంలా మారుతోంది. తక్కువ సమయంలో వినోదాన్ని అందించే ఈ వీడియోలను వరుసగా స్క్రోల్‌ చేసే అలవాటు ఇప్పుడు చాలా మందికి ఉంది. అయితే ఈ అలవాటుగా ఏకాగ్రత, స్వీయ నియంత్రణ వంటి మెదడు సామర్థ్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

2024లో Frontiers in Human Neuroscienceలో ప్రచురితమైన ఒక EEG అధ్యయనంలో 56 మంది యువకులపై షార్ట్ వీడియోల ప్రభావంపై పరిశీలన జరిపారు. షార్ట్‌ఫార్మ్‌ వీడియోలకు ఎక్కువగా అలవాటు ఉన్నవారిలో మెదడులోని ప్రీఫ్రంటల్‌ ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ కంట్రోల్‌ సూచిక తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతం ఏకాగ్రతను నియంత్రించడం, నిర్ణయాలు తీసుకోవడం, పనిపై దృష్టి నిలిపి ఉంచడం వంటి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఎక్కువగా షార్ట్స్ చూసేవారిలో ఏకాగ్రత లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు.

పరిశోధకుల ప్రకారం ఎక్కువసేపు షార్ట్ వీడియోలు చూస్తూ ఉండటం వల్ల భావోద్వేగాలకు సంబంధించిన తక్కువ స్థాయి మెదడు కార్యకలాపాలు ఎక్కువగా నిమగ్నమవుతాయి. తద్వారా స్వీయ నియంత్రణ, ఏకాగ్రతకు సంబంధించిన ఉన్నత స్థాయి ప్రాంతాల కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా జరిగే ప్రభావం అని చెప్పలేమని పరిశోధకలు స్పష్టంచేశారు. ఇటీవలి సమీక్షలో 71 అధ్యయనాల్లో 98,299 మంది డేటాను విశ్లేషించగా, షార్ట్‌ఫార్మ్‌ వీడియో వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో కాగ్నిషన్‌, ముఖ్యంగా ఏకాగ్రత, స్వియ నియంత్రణతో ప్రతికూల సంబంధం కనిపించింది.

అందువల్ల రీల్స్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, వినియోగ సమయాన్ని పరిమితం చేయడం, తరచూ విరామాలు తీసుకోవడం, చదువు లేదా పని సమయంలో ఫోన్‌ దూరంగా ఉంచడం వంటి డిజిటల్‌ అలవాట్లు ఏకాగ్రతను కాపాడుకోవడంలో సహాయపడే అవకాశముంది.

Follow Us
ఆగస్టులో చివరి చంద్ర గ్రహణం.. వీరు నిందలు మోయడం ఖాయం!
ఆగస్టులో చివరి చంద్ర గ్రహణం.. వీరు నిందలు మోయడం ఖాయం!
సెప్టెంబర్‌లో అదృష్ట రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్‌లో అదృష్ట రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
షవర్‌ నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి
షవర్‌ నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి