AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్‌లో అదృష్ట రాశులివే..! ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో లాభాలు

September 2026 Horoscope: సెప్టెంబర్ 2026లో నాలుగు ప్రధాన గ్రహాల రాశి మార్పులు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజుడి సంచారాలతో మాలవ్య, భద్ర, బుధాదిత్య వంటి శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా మేషం, కన్య, తుల రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి, ఆదాయ మార్గాలు, గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్‌లో అదృష్ట రాశులివే..! ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో లాభాలు
September 2026 Lucky Zodiac Signs
Janardhan Veluru
|

Updated on: Aug 22, 2026 | 1:12 PM

Share

జ్యోతిష్య పరంగా సెప్టెంబర్ 2026 నెల ప్రత్యేకంగా ఉండనుంది. ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశి మార్పులు చేయనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 7న బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించడంతో భద్ర రాజయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించడంతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ సంచారాల ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుందని జ్యోతిష్య పండితులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా మూడు రాశులకు సెప్టెంబర్ నెల అదృష్టంపట్టే అవకాశం ఉంది.

మేష రాశి

సెప్టెంబర్ నెల మేష రాశి వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. కష్టానికి తగిన ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు సహాయపడుతాయి. పని విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి సెప్టెంబర్‌లో విజయావకాశాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలు అందే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త అవకాశాలు రావచ్చు. కెరీర్‌లో పురోగతికి మార్గాలు తెరుచుకోవడంతో పాటు అనుకున్న ప్రణాళికలు సఫలమయ్యే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ప్రయోజనం కూడా కలిగే సూచనలు ఉన్నాయి.

తులా రాశి

తులా రాశి వారికి సెప్టెంబర్ నెల ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. కెరీర్, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు సామాజికంగా గౌరవం, గుర్తింపు కూడా పెరగవచ్చు. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలాకాలంగా కోరుకుంటున్న ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అందవచ్చు. పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడే అవకాశముంది.

(గమనిక: ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా ఇచ్చే సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us
సెప్టెంబర్‌లో అదృష్ట రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్‌లో అదృష్ట రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
షవర్‌ నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి
షవర్‌ నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?