
మీరు రోజూ స్నానం చేస్తున్నప్పటికీ.. మీ జుట్టు పొడిబారినట్టు ఉంటుందా. దానికి మెయిన్ రీజన్ మీరు జుట్టును సంరక్షణలో చేసే తప్పులే అని నిపుణులు అంటున్నారు. అవును నారాయణ ఆర్‌ఎన్ ఠాగూర్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అరుణిమ రాయ్ ప్రకారం.. మన దేశంలో నివసించే వారి జుట్టు మీడియం నుండి హై పోరోసిటీని కలిగి ఉంటుంది. మనం రోజూ తల స్నానం చేయడం వల్ల మన స్కాల్ప్‌లో ఉండే సహజ నూనెలు కోల్పోయి జుట్టు త్వరగా పొడిగా మారుతుందని చెబుతున్నారు. అయితే తల స్నానాన్ని తగ్గించడం మాత్రమే దీనికి మార్గం కాదని..రోజూ షాంపూ చేసినప్పటికీ మీ స్కాల్ప్ జిడ్డుగా అనిపిస్తే, మీరు మీ జుట్టు, స్కాల్ప్ రకానికి సరిపడని ఉత్పత్తులను వాడుతున్నారని అర్థం.
స్కాల్ప్ రకం vs జుట్టు రకం
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జాలీ చందా ప్రకారం, చాలా మంది కేవలం తమ జుట్టు రకం పైనే దృష్టి పెడతారు కానీ, స్కాల్ప్ రకాన్ని పట్టించుకోరు. అవును కొందరికి జిడ్డు స్కాల్ప్ ఉండి జుట్టు చివర్లు పొడిగా ఉండవచ్చు, లేదా పొడి స్కాల్ప్ ఉండి జుట్టు చివర్లు జిడ్డుగా ఉండవచ్చు. కాబట్టి జుట్టు మొత్తానికి ఒకే రకమైన ప్రొడక్ట్స్ వాడితే ఫలితం ఉండదని ఆమె చెప్పారు.
జిడ్డు స్కాల్ప్, పొడి జుట్టు చివర్లు ఉన్నవారు ఆయిల్-కంట్రోలింగ్ షాంపూను, హైడ్రేటింగ్ కండిషనర్ తో కలిపి వాడాలని.. అదే పొడి స్కాల్ప్, జిడ్డు జుట్టు చివర్లు ఉంటే దీనికి రివర్స్ కాంబినేషన్ వాడాలని ఆమె చెబుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. షాంపూ అనేది స్కాల్ప్ కోసం, కండిషనర్ అనేది జుట్టు పొడవు, చివర్ల కోసం మాత్రమే యూజ్ చేయాలి.
జుట్టు రకాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి?
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు, ఎండలో, బయట పని చేసేవారు లేదా దుమ్ముకు గురయ్యేవారు ప్రతిరోజూ షాంపూ చేయాల్సి రావచ్చు. అలాంటి వారు మైల్డ్, సల్ఫేట్-ఫ్రీ, పారాబెన్-ఫ్రీ క్లెన్సర్‌లను షాంపూలతో స్నానం చేయడం బెస్ట్.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.