AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate: చాక్లెట్ లవర్స్.. ఇది తప్పక తెలుసుకోండి.. రోజుకు ఎన్ని తినాలంటే..?

చాక్లెట్ లవర్స్ అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాక్లెట్ మనసుకు హాయినిచ్చినా, అందులోని అధిక కేలరీలు, చక్కెర, కెఫిన్ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. డార్క్ చాక్లెట్‌ను కూడా లిమిట్‌లో తినాల్సిందే.. 6 ఏళ్ల లోపు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంత చాక్లెట్ తినవచ్చు? ఎంత తింటే గుండెకు మంచిది? అనేది తెలుసుకుందాం.

Chocolate: చాక్లెట్ లవర్స్.. ఇది తప్పక తెలుసుకోండి.. రోజుకు ఎన్ని తినాలంటే..?
How Much Chocolate Is Safe To Eat Daily
Krishna S
|

Updated on: Oct 09, 2025 | 7:55 AM

Share

చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. పిల్లలకు అయితే ఫెవరెట్. ఇది మనసుకు తక్షణమే ఆహ్లాదానిచ్చే అద్భుతమైనదని చెప్పొచ్చు. కానీ చాక్లెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాక్లెట్‌లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ కేలరీలు, చక్కెర, కెఫిన్ ఉంటాయి. డార్క్ చాక్లెట్ హెల్దీనే అయినా.. దాన్ని కూడా లిమిట్‌లో తినాల్సిందే. అందుకే మీ వయస్సును బట్టి రోజుకు ఎంత చాక్లెట్ తినవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

6 ఏళ్లలోపు పిల్లలకు

చిన్న పిల్లలు చక్కెర, కెఫిన్‌కు సున్నితంగా ఉంటారు. అందుకే చాక్లెట్‌ను రోజువారీ స్నాక్‌గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వాలి. 1–2 ఏళ్ల వయస్సు పిల్లలకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు 5 గ్రాములు వరకు ఇవ్వవచ్చు, అయితే ఈ వయస్సులో డార్క్ చాక్లెట్‌ను పూర్తిగా నివారించాలి. 3-5 ఏళ్ల పిల్లలకు వారానికి రెండు లేదా మూడుసార్లు 5-10 గ్రాములు సురక్షితం. ఇందులో 25శాతం కంటే తక్కువ కోకో ఉన్న మిల్క్ చాక్లెట్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

6-18 ఏళ్లు..

6-12 ఏళ్ల పిల్లలు కొంచెం ఎక్కువ చాక్లెట్‌ను తట్టుకోగలరు. రోజుకు సుమారు 10–20 గ్రాములు సురక్షితమే అయినా, ప్రతిరోజూ ఇవ్వాల్సిన అవసరం లేదు. దంతాలను శుభ్రం చేయడం తప్పనిసరి. టీనేజర్లు రోజుకు 20-30 గ్రాములు ఆస్వాదించవచ్చు. వీరు కనీసం 60శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఎక్కువ చక్కెర లేకుండా యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.

పెద్దలు – వృద్ధులకు

50 నుండి 80 కిలోల మధ్య బరువున్న పెద్దలు రోజుకు 25-40 గ్రాములు తీసుకోవచ్చు. 70శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి మంచిది. వృద్ధులు కూడా రోజుకు 20–30 గ్రాములు తీసుకోవడం ఉత్తమం. కెఫిన్‌కు సున్నితత్వం ఉన్నవారు పాలు లేదా తేలికైన చాక్లెట్లను ఎంచుకోవడం మంచిది.

బరువు ఆధారంగా..

మీ శరీర బరువులో కిలోగ్రాముకు 0.3 నుంచి 0.5 గ్రాముల చాక్లెట్ వరకు తినవచ్చు. ఉదాహరణకు, 60 కిలోల వ్యక్తి రోజుకు 18–30 గ్రాములు తినొచ్చు.

గుర్తుంచుకోవాల్సినవి:

  • డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటే అందులోని కెఫిన్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు.
  • అలెర్జీకి సంబంధించిన విషయాల కోసం ఎల్లప్పుడూ ప్యాకేజీని చెక్ చేయండి.
  • పిల్లలకు స్నాక్‌గా కాకుండా.. భోజనం అయ్యాక మాత్రమే చాక్లెట్ ఇవ్వండి.

ఒకటి లేదా రెండు చిన్న ముక్కలు మీ రోజును హ్యాపీగా మారుస్తాయి. కానీ మీ వయస్సు లిమిట్‌కు తగ్గట్టే తినండి, కోరిక ఎక్కువైందని మరీ ఎక్కువ తినొద్దు..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే