Sleep: యవ్వన రహస్యం ఇదేనా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే..?

Sleep and Aging: రోజుకు 6 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్రపోవడం వల్ల జీవ సంబంధ వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆరు గంటల కంటే తక్కువ లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్ర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే ఇది సాధారణ సంబంధాన్ని మాత్రమే సూచిస్తుందని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Sleep: యవ్వన రహస్యం ఇదేనా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే..?
Sleeping And Aging
Image Credit source: Pexels

Updated on: Jul 21, 2026 | 1:27 PM

రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి? చాలామంది ఈ ప్రశ్నకు 8 గంటలు అనే సమాధానమే చెబుతారు. అయితే తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు సుమారు 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోవడం జీవ (Biological) వృద్ధాప్యాన్ని నెమ్మదించడంలో సహాయపడవచ్చని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించే ఖచ్చితమైన నియమం కాదని కూడా వారు స్పష్టం చేశారు.

పరిశోధకులు యూకే బయోబ్యాంక్ (UK Biobank)లోని సుమారు 5 లక్షల మంది పెద్దల ఆరోగ్య, నిద్రకు సంబంధించిన వివరాలను విశ్లేషించారు. మెదడు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రోగనిరోధక వ్యవస్థ సహా శరీరంలోని పలు అవయవాల జీవ వృద్ధాప్య సూచికలను పరిశీలించారు.  అధ్యయనం ప్రకారం రోజుకు 6.4 నుంచి 7.8 గంటల మధ్య నిద్రపోయిన వారిలో జీవ వృద్ధాప్య సూచికలు అత్యల్పంగా కనిపించాయి. అదే 6 గంటల కంటే తక్కువ లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయిన వారిలో పలు అవయవాల్లో వేగంగా వృద్ధాప్య లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు.

తక్కువ లేదా ఎక్కువ నిద్ర వల్ల ఏమవుతుంది?

ఇవి కూడా చదవండి

6 గంటల కంటే తక్కువ నిద్ర వల్ల శరీరంలో ఒత్తిడి, వాపు (Inflammation), జీవక్రియలో మార్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే 8 గంటల కంటే ఎక్కువ నిద్ర కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చుని పరిశోధకులు తెలిపారు. ఈ రెండు పరిస్థితులూ వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం కావడంతో సంబంధం ఉందని వెల్లడించారు. అయితే  6 గంటల కంటే తక్కువ లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్ర ఒక్కటే నేరుగా వృద్ధాప్యానికి కారణమని చెప్పలేమని స్పష్టంచేశారు. వయసు, ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి, నిద్ర నాణ్యత వంటి  అనేక అం శాలు కూడా ప్రభావం చూపుతాయని పరిశోధకులు వెల్లడించారు.

మంచి నిద్ర కోసం కొన్ని అలవాట్లు..

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని నిలిపివేయాలి. సాయంత్రం తర్వాత కెఫిన్, అధిక టీ లేదా కాఫీ తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పడకగదిని ప్రశాంతంగా, చీకటిగా ఉంచుకోవడం అవసరం.

Also Read: ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. మీ కోపాన్ని జయించే చిట్కాలు..!

(గమనిక: ఈ అధ్యయనం ప్రకారం 6–8 గంటల నిద్ర ఆరోగ్యకరమైన వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, మీకు తరచూ నిద్రలేమి లేదా అధిక నిద్ర సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us