ఇదో ఔషధాల పుట్ట.. ఆరోగ్యానికి వరం.. చలికాలంలో తింటే మరెన్నీ ప్రయోజనాలో తెలుసా..?

|

Nov 28, 2022 | 7:08 AM

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను అందిస్తుంది.

ఇదో ఔషధాల పుట్ట.. ఆరోగ్యానికి వరం.. చలికాలంలో తింటే మరెన్నీ ప్రయోజనాలో తెలుసా..?
Radish Recipes
Follow us on

శీతాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో అనేక రకాల అంటు వ్యాధులు మన శరీరంపై దాడి చేస్తాయి. చలికాలంలో శరీర రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. ముల్లంగి మీ రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మీరు ముల్లంగిని ఊరగాయలు, సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మలబద్ధకం, కడుపునొప్పి, గ్యాస్ వంటి కడుపు సంబంధిత వ్యాధులకు ఇది ముల్లంగి చక్కటి హోం రెమెడీగా పనిచేస్తుంది. ముల్లంగిలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో చలికాలంలో జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా కాపాడుతుంది. తరచూ ముల్లంగి తింటే రోగాలు దరిచేరకుండా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న ముల్లంగి మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృద్రోగాల బారిన పడకుండా ముల్లంగి పనిచేస్తుంది. ఆంథోసైనిన్ ను ఎక్కువగా ఉన్న ముల్లంగి తింటే గుండె జబ్బులు రావు.

జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణక్రియలు చురుకై అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.. మలబద్ధకం కూడా వదిలించే శక్తి ముల్లంగికి ఉంది. ముల్లంగిలో ఉన్న పీచు పదార్థం మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. మొలలు ఉన్న వారు ముల్లంగి తినటం అలవాటు చేసుకుంటే మంచిది. అంతేకాదు తక్కువ కెలెరీలున్న ముల్లంగితో త్వరగా ఆకలి అనే భావన కలగకుండా ఉంటుంది. ముల్లంగి మన శరీరంలోని విషాలను, మలినాలను బయటకు పంపేందుకు చక్కటి సాధనం. ముల్లంగి తింటే చాలు ప్రత్యేకంగా డీటాక్స్ కోర్సు చేయాల్సిన పనిలేదు. బ్లడ్ షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచే శక్తి ఉన్న ముల్లంగికి ఉంది.  మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను అందిస్తుంది.

ముల్లంగిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఇందులోని యాంతోసినిన్ వల్ల యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా మన ఒంటికి చేరతాయి. పురుషుల్లో సంతానోత్పత్తికి ముల్లంగి సహకరిస్తుందని నిపుణులు తెలిపారు. ముల్లంగితోనే కాదు.. దాని ఆకులతో కూడా చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులు కామెర్ల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముల్లంగి, వాటి ఆకులే కాదు రసం కూడా మంచిది. తాజా ముల్లంగి రసం తీసి అందులోకి నాలుగు చుక్కల నిమ్మరసం కావాలంటే చిటికెడు మిరియాల పొడి వేసుకుని జ్యూస్ ట్రై చేయండి. మూత్ర సంబంధిత వ్యాధులకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి