Raw Chicken: పచ్చి చికెన్ ఎన్ని రోజులు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు..? ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

చికెన్ ఫ్రిజ్ లో పెడుతున్నారా..? చాలా మందికి దీని గురించి పూర్తిగా తెలియదు. చికెన్‌ను సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా చికెన్ ని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? వండిన చికెన్ ని కాకుండా… పచ్చి చికెన్ ని ఎన్ని రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేయాలో తప్పక తెలుసుకోండి..

Raw Chicken: పచ్చి చికెన్ ఎన్ని రోజులు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు..? ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి
Chicken Fridge Time

Updated on: Nov 23, 2025 | 9:09 AM

ఫ్రిజ్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నిత్యావసర వస్తువుగా మారింది. కూరగాయలు, పండ్ల నుండి పాలు, పచ్చి చికెన్ వరకు ప్రతిదీ నిల్వ చేస్తుంది. కానీ, చికెన్‌ను ఫ్రిజ్‌లో ఎంతకాలం ఉంచడం సురక్షితం, అది ఎప్పుడు చెడిపోవడం ప్రారంభమవుతుంది? చాలా మందికి దీని గురించి పూర్తిగా తెలియదు. చికెన్‌ను సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా చికెన్ ని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? వండిన చికెన్ ని కాకుండా… పచ్చి చికెన్ ని ఎన్ని రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేయాలో తప్పక తెలుసుకోండి..

ఫ్రిజ్ ఉంది కదా అని చాలా మంది ఉడికించని చికెన్ తెచ్చి… ఎక్కువ రోజులు నిల్వ చేస్తూ ఉంటారు. ఫ్రిజ్ లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవకుండా ఉంటాయి. కానీ, మీకు తెలియని విషయం ఏంటంటే.. ఫ్రిజ్ లో కూడా బాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది. రిఫ్రిజిరేషన్ అలాంటి చెడిపోయే బాక్టీరియాను ఆపదు. అది కేవలం నెమ్మదిస్తుంది. అంటే.. ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత 4°C కంటే ఎక్కువగా పెరిగినా, రెగ్యులర్ గా ఫ్రిజ్‌ తలుపులు తెరుస్తూ ఉంటే కూడా చికెన్‌ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు ఫ్రిజ్ తలుపులు అలాగే, తెరిచి ఉంచినా కూడా బాక్టీరియా పెరుగుదలను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు.

అయితే, పచ్చి చికెన్ ని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి అనుకుంటే 2 లేదంటే, 3 రోజులు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు. 48 గంటల్లోపు వండేసుకోవాలి. అంతకంటే, ఎక్కువ రోజులు పచ్చి చికెన్‌ ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి అనుకుంటే మాత్రం డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇక్కడ పూర్తిగా గట్టకట్టేలా స్టోర్ చేసినప్పుడు చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చికెన్‌ను ఎప్పుడూ గాలి చొరబడని కంటైనర్‌లో లేదా గట్టిగా మూసివున్న కవర్‌లో నిల్వ చేయాలి. వదులుగా, కవర్‌ చేయకుండా నిల్వ చేయడం వల్ల కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు వంటి ఇతర ఆహారాలకు బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది చికెన్ వండడానికి ముందు కడుగుతారు. కానీ, దీనివల్ల నీటి బిందువుల ద్వారా సింక్‌లు, కౌంటర్‌టాప్‌లు, స్టవ్‌లకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే నిపుణులు చికెన్‌ను కడగకుండా నేరుగా ఉడికించాలని సిఫార్సు చేస్తున్నారు. వేసవిలో కూడా చికెన్ త్వరగా చెడిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..