ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ఇందు కోసం కొంతమంది ప్రతిరోజూ గంటలకు గంటలు ఇంటిని శుభ్రం చేయడానికి కేటాయిస్తారు. అదే తక్కువ సమయం ఉంటే ఇంటిని గబగబా శుభ్రం చేసేస్తారు. దీని కారణంగా పని తగ్గడానికి బదులుగా.. పని పెరుగుతుంది. అవును పండగలు, ఫంక్షన్ల సమయంలో మాత్రమే కాదు.. ఏ చిన్న సందర్భం దొరికినా ఇంట్లోని ఆడవాళ్ళు గంటల తరబడి ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ విషయాన్నీ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే ఎంత శుభ్రం చేసినా ఒకొక్కసారి ఇల్లు శుభ్రంగా ఉన్నట్లు కనిపించదు. ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు లేదా చిన్న పిల్లలు నివసించే ఇంట్లో.. ఇటువంటి సమస్య ఉంటుంది. అప్పుడు ఆడవాళ్లు తమ ఇంటిని ఎక్కువగా శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే.. వ్యాధుల నుండి రక్షించబడతారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మురికిగా ఉన్న ఇంట్లో నివసించే వారు అనారోగ్యానికి గురవుతారు. కనుక ఇంటిని శుభ్రంగా ఉంచడం మరింత ముఖ్యం. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఇంటిని చాలా ఈజీగా శుభ్రం చేసే పద్దతులను గురించి తెలుసుకుందాం..
సింక్ శుభ్రం చేయడం ముఖ్యం
కొంతమందికి మురికి సింక్‌లో పాత్రలు శుభ్రం చేసే అలవాటు ఉంటుంది. దీని వల్ల పాత్రలను శుభ్రం చేసినా సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంది. కనుక పాత్రలు శుభ్రం చేయడానికి ముందుగా సింక్ శుభ్రం చేసి, తర్వాత మాత్రమే పాత్రలను శుభ్రం చేయండి. దీనితో పాటు వారానికి ఒకసారి వంటగది మొత్తాన్ని డీప్ క్లీనింగ్ కూడా చేయండి. వంటగదిని శుభ్రం చేయడానికి వేడి నీటిని ఉపయోగించండి.
శుభ్రం చేయడానికి మురికి బట్టలు ఉపయోగించవద్దు
చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి మురికి బట్టలు వాడతారు. దీని వల్ల ఇల్లు శుభ్రం చేస్తున్నా.. అది మురికిగా, బ్యాక్టీరియతో నిండిపోతుంది. అందువల్ల ఇంటిని శుభ్రపరిచేటప్పుడు మురికి బట్టలను ఎప్పుడూ ఉపయోగించవద్దు. దీనికి బదులుగా కాటన్ క్లాత్‌ని ఉపయోగించాలి. అప్పుడు శుభ్రపరచడం చాలా సులభం అవుతుంది.
దుమ్ము దులిపిన తర్వాత
ఇంటిలోని దుమ్ము, బుజులను దులిపిన తర్వాత చాలా మంది హడావిడిగా ఇంటిని తుడిచేస్తారు, లేదా బాగా అలసిపోయినందున ఇంటిని తుడుచుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంటిని పూర్తిగా శుభ్రపరచడం సాధ్యం కాదు. దీని కారణంగా ఇంట్లోని దుమ్ము దులిపి శుభ్రం చేయాలనుకున్న శ్రమ వృధా కావచ్చు. అందువలన దుమ్ము దులిపిన తర్వాత ఖచ్చితంగా ఇంటిని తడి బట్టలతో శుభ్రం చేయండి.
వంటగది డబ్బాలను కూడా శుభ్రం
చాలా మంది ప్రజలు పండుగల సమయంలో మాత్రమే కిచెన్ కంపార్ట్మెంట్లను శుభ్రం చేస్తారు. అయితే మీరు ఖచ్చితంగా నెలకు ఒకసారైనా సరే కిచెన్ కంపార్ట్మెంట్లను శుభ్రం చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..