Snore Problem: గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..! ఉపశమనం కోసం సింపుల్ టిప్స్ మీకోసం

గురక సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా ఈ గురక వారి భాగస్వాములకు సమస్యగా మారుతుంది. నిద్ర సమస్యతో ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితిలో గురకను వదిలించుకోవడానికి కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన అనేక మార్పులు వస్తాయి. అయితే ఇదిమాత్రమే కాదు గురకను తగ్గించడానికి కొన్ని హోం రెమెడీస్‌ను కూడా పాటించవచ్చు.

Snore Problem: గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..! ఉపశమనం కోసం సింపుల్ టిప్స్ మీకోసం
Snore Problem
Image Credit source: pexels

Updated on: Oct 15, 2024 | 7:45 PM

రాత్రి వేళా నిద్రపోతున్నప్పుడు కొంత మంది గురక పెడతారు. ప్రస్తుతం ఇది సాధారణ సమస్యగా మారింది. గురక పెడుతున్న వారు మనకు తెలిసిన వారులో ఉండే ఉంటారు. ఈ గురక సమస్య ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు.. ఆ వ్యక్తీ గదిలో నిద్రించే మొత్తం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. మీ భాగస్వామి రాత్రంతా గురక పెడుతూ ఉంటే.. అవతలి వ్యక్తి నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా గురక పెట్టడం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.

గురక సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా ఈ గురక వారి భాగస్వాములకు సమస్యగా మారుతుంది. నిద్ర సమస్యతో ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితిలో గురకను వదిలించుకోవడానికి కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన అనేక మార్పులు వస్తాయి. అయితే ఇదిమాత్రమే కాదు గురకను తగ్గించడానికి కొన్ని హోం రెమెడీస్‌ను కూడా పాటించవచ్చు.

నీరు-పుదీనా: గురక తగ్గాలంటే కొన్ని పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ రెమెడీని పాటించడం ద్వారా చాలా వరకు ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క పొడి: దాల్చిన చెక్క పొడిని కూడా గురక సమస్య తీరడానికి బెస్ట్ మెడిసిన్. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి. దీని ప్రభావం వలన నిద్రపోతున్న సమయంలో గురక రాదు.

వెల్లుల్లి: వెల్లుల్లి కూడా ఈ సమస్యను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను వేయించి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి.. సహజంగా వెల్లుల్లి వేడిని కలిగించే గుణం ఉంటుంది. కనుక వేడి వాతావరణంలో లేదా ఎక్కువ పరిమాణంలో వెల్లుల్లిని తినకూడదు. అలాగే వేడి పదార్థాలంటే అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

ఆలివ్ నూనె: ఆలివ్ నూనె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. గురక సమస్యను తగ్గించడంలో కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. దీని కోసం రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల ఆలివ్ నూనెను ముక్కులో వేయాలి.

దేశీ నెయ్యి: గురక సమస్యను తగ్గించుకోవడానికి దేశీ నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం దేశీ నెయ్యిని వేడి చేసి ఒక చుక్క నెయ్యిని బొడ్డులో వేయాలి. అయితే నెయ్యి ఎక్కువ వేడిగా ఉండకూడదని గుర్తుంచుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)