
చర్మంపై ముడతలు ఏర్పడటానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. తగిన మాయిశ్చరైజర్ లేకపోతే చర్మం పొడిబారిపోతుంది అంత మంచిగా కనిపించదు. దీని వల్ల ముఖంపై వయస్సు ప్రభావం త్వరగా కనిపిస్తుంది. అందుకే స్కిన్ కేర్ నిపుణులు మంచి హైడ్రేటింగ్ క్రీమ్ ఉపయోగించాలని సూచిస్తారు. ఈ క్రీమ్ కేవలం ముడతలను తగ్గించడమే కాదు, మొటిమలు, పొడిబారిన చర్మం వంటి సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కుంకుమపువ్వు చర్మ ఆరోగ్యానికి అమోఘమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి హానికరమైన టాక్సిన్స్ తొలగించి, అందమైన కాంతివంతమైన రూపాన్ని అందిస్తుంది. సన్ టాన్ కూడా తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. పైగా ఇది స్కిన్ హైడ్రేషన్‌ను పెంచి మృదువుగా మార్చే గుణాన్ని కలిగి ఉంది.
ముందుగా గోరువెచ్చని నీటిలో కుంకుమపువ్వు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన కంటైనర్‌లో నేచురల్ క్రీమ్ బేస్ తీసుకోండి. ఇప్పుడు నానబెట్టిన కుంకుమపువ్వు నీటిని ఈ క్రీమ్ బేస్‌లో వేసి బాగా కలపాలి. తర్వాత కుంకుమపువ్వు ఎసెన్షియల్ ఆయిల్, టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. అంతే సింపుల్ రెడీ అయ్యింది యాంటీ ఏజింగ్ క్రీమ్.
ఈ క్రీమ్‌ను గాలి చొరబడని కంటైనర్‌లో వేసి గదిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. మెరుగైన ఫలితాల కోసం రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరిచి ఈ క్రీమ్‌ను అప్లై చేయాలి. ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో తయారుచేసిన ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా మార్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది.