Holi Festival: హోలీ ముందు రోజు చేసుకునే ఈ పండగేంటో తెలుసా? ఆ రోజు అస్సలు చేయకూడని పనులివే..!
సంక్రాతి సమయంలో మనం వేసుకునే భోగి మంటల తరహాలో ఈ పండుగ రోజు కూడా భోగి మంటలు వేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ మంటలు వేసుకుంటారు. హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు, అతని అత్త హోలిక సంబంధించి కథకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో హిందువులు ఎక్కువగా చేసుకునే పండుగ హోలి. అయితే హోలీకి ముందు రోజు హోలీకా దహన్ అంటూ వేడుకగా మరో పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాతి సమయంలో మనం వేసుకునే భోగి మంటల తరహాలో ఈ పండుగ రోజు కూడా భోగి మంటలు వేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ మంటలు వేసుకుంటారు. హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు, అతని అత్త హోలిక సంబంధించి కథకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. చోటి హోలీగా పిలిచే ఈ హోలికా దహన్ పండుగ ఈ ఏడాది మార్చి 17న వచ్చింది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఈ పండుగ చేసుకోవడానికి హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పండుగ నేపథ్యంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని చేయదగిన, చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
హోలికా దహన్ రోజు చేయాల్సిన, చేయకూడని పనులివే
దృక్ పంచాంగం ప్రకారం, హోలికా దహన్ కోసం సరైన ముహూర్తాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. హోలికా దహనానికి ముందు హోలికా పూజ జరుగుతుంది. అదనంగా, హోలికా దహన్ సరైన సమయంలో చేయాలి. అలా చేయకపోతే దురదృష్టం మరియు బాధలు వస్తాయని కొందరి నమ్మకం.
శనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి, గోధుమలు, ఆవాలు, చక్కెర వంటి పోషకమైన ఆహార పదార్థాలను ఆవు పేడతో నిప్పులో ఉంచండి. ఇది అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు. తర్వాత మిగిలిపోయిన బూడిదను భూమికి ఎరువుగా వేసుకుంటే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం.
హోలికా దహన్ రోజున ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రోజు ఎవరికైనా రుణం ఇస్తే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని నమ్ముతారు.
ఈ రోజు చాలా మంది సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసం పాటించేటప్పుడు పండ్లు, పాల ఉత్పత్తులతో పాటు సాత్విక్ ఆహార పదార్థాలను తప్పనిసరిగా తినాలి. ఉపవాసం విరమించడానికి చంద్రునికి నీరు, అన్నం సమర్పించాలి. ఆ తరువాత, హోలీకి తయారుచేసిన గుల్గులే, మల్పువా, పూరీ వంటి రుచికరమైన వంటకాలతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా చేసిన కూరగాయలను తినవచ్చు.
ధృక్ పంచాంగంప్రకారం హోలికా పూజ పదార్థం లేదా సామాగ్రిలో సరైన పదార్థాలను తప్పనిసరిగా చేర్చాలి. అందులో ఒక గిన్నె నీరు, ఆవు పేడతో చేసిన పూసలు, రోలీ మరియు పగలని బియ్యం, అగర్బత్తి, ధూపం, పువ్వులు, పచ్చి పత్తి దారం, పసుపు ముక్కలు, మూంగ్, బటాషా, గులాల్ పొడి, కొబ్బరికాయలు పప్పు ఉన్నాయి. అలాగే, తాజాగా పండించిన గోధుమలతో శనగలు వంటి ధాన్యాలను పూజా వస్తువులలో చేర్చవచ్చు.
హోలికను ఉంచే ప్రదేశాన్ని ఆవు పేడతో పాటు పవిత్ర జలంతో శుభ్రం చేయాలి.
హోలికా దహన్ సందర్భంగా వెలిగించిన భోగి మంట నుండి బూడిదను సేకరించి శరీరంపై పూయవచ్చు. బూడిద పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది శరీరం, ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు.