
హోలీ పండుగ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక హోలీ ఆడిన తర్వాత తమ స్నేహితులకు స్వీట్ తినిపించి విషెస్ చెబుతుంటారు. అయితే మీరే స్వయంగా బాద్ షా తయారు చేసి, మీ బంధు మిత్రులకు సర్ ప్రైజ్ ఇవ్వండి.

కాగా, బాద్ షా తయారీ కోసం కావాల్సిన పదార్థాలు : మైదా అర కేజీ, డాల్డా 200 గ్రాములు, బేకింగ్ సోడా, చక్కెర కేజీ, యాలకుల పొడి వన్ టీ స్పూన్, నెయ్యి 10 గ్రాములు, అర లీటర్ వాటర్, ఆయిల్.

తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, బేకింగ్ సోడా ,డాల్డా అన్నీ బౌల్‌లో వేసుకొని, సరిపోయే అన్ని నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీని వలన పిండి చిక్కగా మారి, బాద్‌షాలు చాలా బాగా వస్తాయి.

ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, మరో బౌల్ పెట్టి, అందులో బాద్ షాలు వేయించు కోవడానికి సరిపడ నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత గుడ్రంగా తయార చేసుకొని, వాటి మధ్యలో చిన్న రంధ్రం చేసి, వాటిని నూనెలో వేస్తూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వస్తే బాద్ షాలు చాలా టేస్టీగా ఉంటాయి.

పాకం తయారీ : ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని, అదే విధంగా పంచదార వేసి, సన్నగా పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తీగలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాద్ షాలను అందులో వేసి 10 నిమిషాలు అందులో ఉంచి తియ్యాలి. అంతే టేస్టీ టేస్టీ హాలీ స్పెషల్ స్వీట్ బాద్ షా తయారీ రెడీ.