
తులసి మొక్కను హిందువులు తల్లిగా పూజిస్తారు. తులసికోటను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని నిత్యం పూజలు చేసి , ప్రదక్షిణాలు చేయటం హిందూ సాంప్రదాయం, ఆచారాల్లో ఒక భాగం. తులసి దళంతో భగవాన్ విష్ణువును , శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజిస్తారు. తులసిదళం లేకుండా విష్ణువు నుపూజిస్తే aa పూజ అసంపూర్ణమని పండితులు చెబుతారు. తులసిదళం శుద్ధి , భక్తి , ఆరోగ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. అయితే తులసిచెట్టు వాడి పోయి ఆకులు రాలి ఎండిపోతుంటే ఆ మొక్కను ఎలా తొలగించాలి, కొమ్మలను ఆకులను ఏమి చేయాలనే దానికి కొన్ని నియమాలను పండితులు చెబుతున్నారు.
కొందరు తులసిమొక్కలను , ఎండిపోయిన వాటిని ఎలా పడితే అలా పీకేసి చెత్త బుట్టలో పడవేయటం లేదంటే రోడ్ల మీద విసరటం చేస్తుంటారు. ఇలాంటిచర్యలు వల్ల వారి ఇంట్లో వ్యతిరేక శక్తుల ప్రభావము ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. తులసి మాల విష్ణువుకు చాలా ఇష్టం. అందువల్ల తులసి ఆకులు , కొమ్మలు , ఇతర ఏభాగాలకు అపచారం చేయకూడదు. నలుగురూ నడిచేదారిలో వాటిని పడవేయకూడదు. ఒకవేళ మొక్కలను పికాల్సి వచ్చినా .. పవిత్రంగా స్నానం చేసి , పూజ చేసి మనసులో భగవాన్ శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ తొలగొంచాలి. తరువాత దానిని భూమిలో గుంత తీసి మట్టితో కప్పి వేయాలి . లేదంటే పేపర్ లో చుట్టి పారె నదుల్లో నిమ్మజ్జనం చేయవచ్చు అని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇలా మనస్సులో ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం జపించటం వల్ల తెలిసి తెలియక తులసి మాత విషయంలో చేసిన దోషాలు తొలిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఎండిపోయిన తులసి మొక్కలు తీయకుండా.. గురువారం , ఏకాదశి , పౌర్ణమి , అమావాస్య రోజుల్లో మాత్రమే ఇలా నిమజ్జనం చేయటం శుభఫలమని పండితులు చెబుతున్నారు.
కొందరు తులసి మొక్కలు ఎండి పొతే సాయిబాబ ఆలయాల్లోకి తీసుకువెళ్లి అప్పగిస్తారు. ఆలా తీసుకువెళ్లే సమయంలోనూ పవిత్రంగా, నియమబద్ధంగా, భక్తి భావనతో ఆలయానికి తీసుకువెళ్లటం ద్వారా ఆ వాసుదేవుని కృపకు పాత్రులు కావటంతో పాటు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.