అమ్మమ్మకాలం నాటి చిట్కా.. ఒత్తైన, సిల్కీ జుట్టు కోసం మందారం మెంతులతో నూనె.. ఎలా చేసుకోవాలంటే..

మారిన జీవన శైలి, వాతావరణంలో మార్పులతో ప్రస్తుతం జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. దీంతో జుట్టు సన్నగా, నిర్జీవంగా కనిపిస్తుంది. దీంతో ఒత్తైన జుట్టుకోసం మార్కెట్ లో దొరికే రకరకాల రసాయనాల నూనెలను ట్రై చేస్తారు. అయితే వీటికంటే అమ్మమ్మ కాలం నాటి సహజమైన నూనె ఈ సమస్యను పరిష్కరించగలదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. మందార, మెంతులతో తయారు చేసే ప్రత్యేక నూనె జుట్టుకు ఒక వరం.

అమ్మమ్మకాలం నాటి చిట్కా.. ఒత్తైన, సిల్కీ జుట్టు కోసం మందారం మెంతులతో నూనె.. ఎలా చేసుకోవాలంటే..
Hibiscus Fenugreek Hair Oil

Updated on: Oct 05, 2025 | 4:23 PM

నేటి వేగవంతమైన జీవితాల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. కాలుష్యం, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం, రసాయన ఆధారిత జుట్టు సంరక్షణ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల మన జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే జుట్టు సంరక్షణకు సహజమైన, అమ్మమ్మ కాలం నాటి చిట్కాలు ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణ కోసం అనేక అద్భుతమైన మూలికలను ప్రస్తావిస్తుంది. వాటిలో మందార ,మెంతి గింజలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తయారు చేసే నూనె జుట్టును పునరుజ్జీవింపజేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రత్యేక నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

మందార పువ్వుల ప్రయోజనాలు

  1. మందార పువ్వులు, ఆకుల్లో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్నాయి.
  2. జుట్టును బలోపేతం చేయడానికి.. మందారంలోని అమైనో ఆమ్లాలు జుట్టుకు ప్రాథమిక నిర్మాణ పదార్థం అయిన కెరాటిన్ ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు కుదుర్లను బలపరుస్తుంది. దీంతో జుట్టు
    ఊడిపోకుండా నిరోధిస్తుంది.
  3. కండిషనింగ్: మందార పువ్వులు, ఆకులు సహజ కండిషనర్‌గా పనిచేసే జిగట పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అదే సమయంలో జుట్టు పొడిబారకుండా చేస్తుంది.
  4. జుట్టు పెరుగుదలకు: తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లను పోషిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. చుండ్రు నుంచి ఉపశమనం: దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, తల దురదను తగ్గించడంలో సహాయపడతాయి.

మెంతుల ప్రయోజనాలు

  1. మెంతి గింజల్లో ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
  2. జుట్టు రాలడం నియంత్రణ: మెంతుల్లో ఉండే ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. తద్వారా జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
  3. కొత్త జుట్టు పెరుగుదల: లెసిథిన్ జుట్టు మూలాలను పోషిస్తుంది. పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది, తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
  4. పొడిబారడం, గరుకుదనాన్ని వదిలించుకోండి: మెంతులు జుట్టులోని తేమను కాపాడడంలో సహాయపడతాయి. దీనివల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా మారదు.

మందార , మెంతి నూనె తయారు చేసే విధానం:

కావాల్సిన పదార్ధాలు

  1. కొబ్బరి నూనె- 1 కప్పు
  2. మందార పువ్వులు- 5-6
  3. మందారం ఆకులు – 4
  4. మెంతులు- 2 టేబుల్ స్పూన్లు

నూనె తయారు చేసే విధానం

  1. ఒక పాత్రలో కొబ్బరి నూనె తీసుకుని తక్కువ మంట మీద వేడి చేయండి.
  2. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మందార పువ్వులు, ఆకులు, మెంతి గింజలను జోడించండి.
  3. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పాటు తక్కువ మంట వేడి చేయండి. మెంతులు లేత గోధుమ రంగులోకి మారే వరకూ.. మందార రంగు నూనెలోకి వచ్చే వరకు నూనె ను వేడి చేయండి.
  4. మంటను ఆపి.. , నూనెను పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మందారం నూనెను వడకట్టి శుభ్రమైన గాజు సీసాలో నింపండి.

ఎలా ఉపయోగించాలంటే

  1. ఉత్తమ ఫలితాల కోసం ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం అవసరం.
  2. వారానికి కనీసం రెండుసార్లు, పడుకునే ముందు ఈ నూనెను వేడి చేసి.. తలకు సున్నితంగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుర్లకు పోషణ లభిస్తుంది.
  3. జుట్టుకి నూనె అప్లై చేసి రాత్రంతా లేదా కనీసం 1 గంట పాటు అలాగే ఉంచండి.
  4. మర్నాడు ఉదయం తేలికపాటి లేదా ఆయుర్వేద షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)