Kitchen Hacks: ఏ వంట చేయాలన్నా కచ్చితంగా అవసరమైన వాటిలో నూనె ముఖ్యమైంది. వంటకు రుచిని ఇచ్చే వాటిలో నూనె ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే నూనె వంటకు ఎలాగైతే రుచిని ఇస్తుందో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే దీనిని లిమిట్‌కు తగ్గట్లుగా తీసుకుంటేనే సుమా.! ఒకవేళ నూనెలను మితిమీరి తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందులోనూ కల్తీ నూనెను తీసుకుంటే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వంట నూనెల ధరలు దూసుకుపోతున్నాయి.
ఈ క్రమంలోనే దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు మోసగాళ్లు కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. అసహజ పద్ధతుల్లో నూనెను తయారు చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. ఇక విడిగా కొనుగోలు చేస్తేనే కదా ఈ సమస్య అనుకునేరు.. ఎందుకంటే కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రాండెండ్ కంపెనీల పేరుతో నకిలీ నూనెను మార్కెట్లోకి వదులుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు నూనె, కల్తీ నూనెలకు మధ్య తేడా కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..
* మీరు ఉపయోగిస్తున్న నూనె మంచిదా, నకిలీదా గుర్తించడానికి ముందుగా ఒక పాత్రలో కొంచెం నూనె వేసి. ఫ్రిజ్‌లో కొన్ని గంటలపాటు ఉంచాలి. కొద్ది సేపటి తర్వాత గమనిస్తే నూనె ఉపరితలంపై తెల్లటి పొర వస్తే అది నకిలీ నూనె అని గుర్తించాలి.
* ముందుగా కొంచెం నూనెను ఒక టెస్ట్ ట్యూబ్‌లోకి తీసుకోవాలి. అనంతరం దానికి కొన్ని చుక్కల నైట్రిక్ యాసిడ్‌ను జత చేయాలి. తర్వాత ట్యూబ్‌ను వేడి చేయాలి. ఒకవేళ నూనె రంగు మారితే అది నకిలీ నూనె అని అర్థం.
* నూనె నకిలీదో తెలుసుకోవడానికి ఇది చాలా సింపుల్ ట్రిక్. అరచేతిలో కొన్ని చుక్కల నూనెను వేసుకొని గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తున్న సమయంలో రంగు బయటకు రావడం లేదా రసాయనాలతో కూడిన వాసన వస్తే అది కల్తీ అని తెలుసుకోండి.
* ఇటీవల ఆవ నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆవ నూనె స్వచ్ఛతను తెలుసుకోవాలంటే నాలుకపై కొంచెం ఆవ నూనెను వేసుకొని రుచి చూడాలి. ఒకవేళ నూనె రుచి నల్ల మిరియాల్లాగా ఉంటే అది స్వచ్ఛమైన నూనె అని గుర్తించాలి. అలా కాకుండా చేదుగా ఉంటే మాత్రం అది నకిలీదని గుర్తించాలి.
Also Read: Crocodile in musi: మూసీలో మొసలి కలకలం… భయాందోళనలో స్థానికులు