సాయిబాబా భక్తులు తప్పక సందర్శించాలని భావించే పుణ్యక్షేత్రం షిర్డీ. జీవితంలో ఒక్కసారైన అక్కడివెళ్లాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరికొందరు ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లి వస్తుంటారు. మీరు కూడా షిర్డీ వెళ్లాలని భావిస్తుంటే మీకో శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ఓ అద్భుతమైన అవకాశాన్ని సాయి భక్తులకు అందిస్తోంది. సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ పేరుతో ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రెండు రాత్రులు, మూడు పగళ్లు ఉండే ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రతి బుధవారం ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా షిర్డీ, శనిశిగ్నాపూర్ లను సందర్శించొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్యాకేజీ పేరు: సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్(ఎస్‌హెచ్ఆర్009)
వ్యవధి: రెండు రాత్రులు/మూడు పగళ్లు
సందర్శించే ప్రాంతాలు: శనిశిగ్నాపూర్, షిర్డీ
ప్రయాణ తేదీ: ప్రతి బుధవారం
ప్రయాణ సాధనం: రైలు
డే1(ప్రయాణం ప్రారంభం): సికింద్రాబాద్ నుంచి షిర్డీ యాత్ర ప్రారంభమవుతుంది. బుధవారం సాయంత్రం 18.50గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17064) ఎక్కి, రాత్రంతా ప్రయాణం చేస్తారు.
డే2(షిర్డీ): గురువారం ఉదయం 7.10 గంటలకు నాగోర్ సోల్ చేరుకుంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని ఐఆర్సీసీటీసీ సిబ్బంది మిమ్మల్ని క్యాబ్ లో షిర్డీకి తీసుకువెళ్లి హోటల్లో దింపుతారు. హోటల్లో చెకిన్ అయ్యి, ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటారు. హోటల్ నుంచి నడిచి వెళ్లేంత దగ్గరలోనే షిర్డీ సాయినాథుని ఆలయం ఉంటుంది. పర్యాటకులే సొంత ఖర్చులతో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నానికి హోటల్లో చెక్ అవుట్ అయ్యి షిర్డీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిశిగ్నాపూర్ కు బయలు దేరుతారు. అక్కడ శని టెంపుల్ ను సందర్శిస్తారు. సాయంత్రానికి తిరిగి నాగోర్ సోల్ చేరుకుంటారు. రాత్రికి రైల్వే స్టేషన్కు చేరుకొని 20.30గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్( రైలు బండి నంబర్ 17063) ఎక్కుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
డే3(హైదరాబాద్): ఉదయం 08.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో ప్రయాణం ముగుస్తుంది.
స్లీపర్ క్లాస్(స్టాండర్డ్) లేదా థర్డ్ ఏసీ(కంఫర్ట్ క్లాస్)లో రైలు ప్రయాణం, షిర్డీలో లోకల్ ప్రయాణానికి ఏసీ వాహనం, గురువారం అల్పాహారం, ట్రావెల్ ఇన్సురెన్స్ వంటివి అందిస్తారు. అయితే దేవాలయాలలో దర్శన టిక్కెట్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..