ఉపవాసం మనిషి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ఎప్పుడూ సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు తరచూ ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. మన దేశంలో పురాతన కాలం నుంచి ఈ ఉపవాసాన్ని ప్రజలు పాటిస్తూ ఉన్నారు. కొందరు ఆధ్యాత్మికంగా పాటిస్తే.. మరికొందరు ఆరోగ్యపరంగా పాటిస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆయుర్వేదం మాత్రమే కాదు, చాలా మంది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసంతో శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని వివరిస్తున్నారు. అందుకనే పూర్వ కాలంలోనే పెద్దలు ఉపవాసం ఉండాలంటూ ఆధ్యాత్మిక కోణంలో జనాలను ప్రేరేపించేవారని కొందరు చెబుతారు. మీరు అటువంటివి నమ్మకపోయినా ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను మాత్రం నమ్మి తీరాలి. అవేంటే ఓ సారి చూద్దాం..
బ్లడ్ షుగర్ నియంత్రణ.. ఉపవాసం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాలు కూడా ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని వివరిస్తున్నారు.
గుండె ఆరోగ్యం పదిలం.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపవాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. సరైన సమయంలో ఉపవాసం రక్తపోటుతోపాటు చెడు కొలెస్ట్రాల్ రెండింటినీ నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఊబకాయాన్ని తగ్గించడంలో.. పెరుగుతున్న బరువును నియంత్రించడానికి ఉపవాసం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, మీరు ఎంత ఎక్కువ ఉపవాసం ఉంటే, మీ శరీర బరువు అంత తగ్గుతుందని చెప్పడం సరికాదు. కానీ సరైన సమయంలో, అవసరమైన మేరకు ఉపవాసం ఉండటం వల్ల పెరుగుతున్న శరీర బరువు నియంత్రణ సాధ్యం అవుతుంది.
మానసిక ఆరోగ్యం.. డిప్రెషన్, ఆందోళన లేదా ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఉపవాసం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన మార్గంలో ఉపవాసం చేయడం వల్ల మీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత ప్రారంభమవుతుంది. దీని కారణంగా కార్టిసాల్ స్థాయి కూడా మెరుగుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..