ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, టెక్నాలజీ కారణంగా సరిపడా నిద్రపోవడంలేదు. ఒక వేళ నిద్రపోయినా దానికంటూ నిర్ధిష్ట సమయం లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగానే చాలా మందికి రాత్రి పూట నిద్ర లేచే అలవాటు ఉంటుంది. మూత్ర విసర్జన చేయడం కోసం లేదా దాహం అయి నీళ్లను తాగడం కోసం.. ఇలా రాత్రి పూట నిద్ర లేవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇక కొందరు నిద్రించే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా నిద్ర లేస్తుంటారు. ఆ క్రమంలోనే పీడకలల వల్ల కూడా నిద్ర నుంచి మెళుకునేవారు కూడా ఉంటారు. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేవడం అనేది సహజమైన విషయమే. అయినప్పటికీ కొందరికి రోజూ అలా 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో నిద్రలేవడం జరుగుతుందంటే మాత్రం కచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటేనే ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కాక ఇంకా ఆ సమయంలో నిద్ర లేచేందుకు ఏయే కారణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో మనం గాఢ నిద్రలో ఉంటాం. ఆ సమయంలో నిద్ర లేస్తే శరీరంపై ఒత్తిడి పడుతుంది. అది ఏదో ఒక రోజు అయితే ఫర్వాలేదు. కానీ ప్రతి రోజూ ఇలా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తుంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారే ఇలా రోజూ రాత్రి ఆ సమయంలో నిద్ర లేస్తుంటారు. అలాగే మెడిసిన్లను వాడేవారు, షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు కూడా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు. అలాగే వయస్సు మీద పడడం, నిద్ర లేమి, పలు రకాల మందులను దీర్ఘకాలంగా వాడుతుండడం వంటి కారణాల వల్ల కూడా రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు.
యాంటీ డిప్రెసెంట్లు, బీటా బ్లాకర్స్, కార్టికో స్టెరాయిడ్స్, దగ్గు, జలుబు మందులను వాడడం, డై యూరెటిక్స్‌ను వాడడం వంటి కారణాల వల్ల రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేవాల్సి వస్తుంది. అయితే మందులను వాడడం తప్పించి మిగిలిన ఏ కారణం వల్ల అయినా సరే నిద్ర లేస్తుంటే మాత్రం ఆయా సమస్యల నుంచి బయట పడే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. లేదంటే సమస్య మరింత తీవ్రతరం దాల్చి, తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే లివర్ పనితీరు మందగించడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా రాత్రి ఆయా గంటల మధ్య సమయంలో నిద్ర లేస్తారు. కాబట్టి.. ఎవరైనా సరే తమకు ఆ సమయంలో మెళకువ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. అలా చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.