Telugu News Lifestyle Here are few home remedies for constipation that you can try while you’re travelling
Constipation: ఆ సమస్య వేధిస్తోందా? ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి చాలు..
ఏదైనా ఆహారంలో ఆకస్మిక మార్పు.. మితిమీరిన వ్యాయామం కూడా మలబద్ధకానికి కారణం కావచ్చు. మరి ముఖ్యంగా ఎక్కువ గంటలు ప్రయాణం చేసినప్పుడు మలబద్ధకం వస్తుంది. సుదీర్ఘ విమాన ప్రయాణం అందుకు ఉదాహరణ.
మలబద్ధకం.. ఇటీవల కాలంలో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. ఒంట్లో అధిక వేడి కారణంగా కూడా ఇది సంభవిస్తుంది. ఏదైనా ఆహారంలో ఆకస్మిక మార్పు.. మితిమీరిన వ్యాయామం కూడా మలబద్ధకానికి కారణం కావచ్చు. మరి ముఖ్యంగా ఎక్కువ గంటలు ప్రయాణం చేసినప్పుడు మలబద్ధకం వస్తుంది. సుదీర్ఘ విమాన ప్రయాణం అందుకు ఉదాహరణ. సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత మలబద్ధకం సాధారణం వస్తుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ప్రయాణ సమయంలో వచ్చే మలబద్ధకాన్ని నివారించివచ్చు. పోషకాహార నిపుణుడు, లోవ్‌నీత్ బాత్రా మాట్లాడుతూ ”ప్రయాణ మలబద్ధకం అనేది ఒక సాధారణ పరిస్థితి. ఇది మనందరికీ సంభవించవచ్చు. ఇది ప్రధానంగా మీ శరీరం రొటీన్ విరుద్ధంగా పనిచేసినప్పుడు సంభవిస్తుంది’ అని అన్నారు. ప్రయాణ మలబద్ధకాన్ని నివారించడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం..
తాగునీరు చాలా సులభమైన నివారణలలో ఒకటి. ఎందుకంటే మలబద్ధకం నిర్జలీకరణ పెద్ద పేగుతో ముడిపడి ఉంటుంది . మీరు సరిగ్గా హైడ్రేట్ అయినప్పుడు, మీ శరీరం మీ పెద్ద పేగు నుండి అదనపు నీటిని తీసుకోవలసిన అవసరం ఉండదు. అప్పుడు పేగులు అదనపు ఒత్తిడికి గురికావు.
అవిసె గింజలు/చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ నీటిలో కరిగిపోతుంది. ఫలితంగా మలం మృదువుగా సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది.
మీరు ప్రయాణిస్తున్నప్పుడు కెఫీన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా నివారించండి, ఎందుకంటే ఇవి మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తాయి. మలబద్ధక ప్రమాదాన్ని పెంచుతాయి.