Health Tips: రాత్రుళ్లు నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారా..? గాఢనిద్ర కోసం ఈ ఆహారాలు తినండి!!

|

Sep 01, 2023 | 6:20 PM

మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోవటం కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, అనేక ఇతర కారణాలు నిద్రలేమికి దారితీస్తాయి. మనకు నిద్ర సరిగా పట్టనప్పుడు మనం చేసే పనులపై సరైన శ్రద్ధ చూపలేకపోతాం.. ఇది తరువాత ఇతర పెను సమస్యలకు దారి తీస్తుంది.

1 / 6
తగినంత నిద్ర లేకపోవడం శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. సరైన నిద్ర కోసం మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మంచి నిద్ర కోసం మీరు తినాల్సిన కొన్ని ఆహారాలు ఇవే...

2 / 6
రోజంతా కష్టపడి పనిచేసినా చాలామందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలను చేర్చుకుంటే, నిద్ర నాణ్యత పెరుగుతుంది. రాత్రివేళ గాఢ నిద్ర రావాలంటే నిద్రపోయేకంటే మూడు గంటల ముందు అన్నాన్ని తినాలి. బియ్యంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నం తినడం వల్ల మంచి నిద్రపడుతుంది.

3 / 6
బాదం - బాదంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, రాత్రివేళ నిద్రపట్టనివారు అరటిపండు తింటే కూడా హాయిగా నిద్ర పడుతుంది.

4 / 6
చెర్రీ జ్యూస్.. ఈ జ్యూస్‌లో మెలటోనిన్‌ అత్యధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఎక్కువసేపు, గాఢమైన నిద్రను ప్రేరేపిస్తుంది.

5 / 6
కివి - రాత్రిపూట కివి తినడం వల్ల బాగా నిద్రపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోలేట్, విటమిన్లు, పొటాషియంతో నిండిన ఈ పండ్లు మీ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి.

6 / 6
ఫ్యాటీ ఫిష్‌ - ఫ్యాటీ ఫిష్‌లో విటమిన్ డి, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయి. ఇది నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.