బీపీ ఇంతకన్నా ఎక్కువ ఉంటే చాలా ప్రమాదమట..!

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ప్రజలు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, ఉద్యోగ భారం, తదితర అంశాల వల్ల చాలామందికి బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం ఏదైనా హాస్పిటల్ కు జనరల్ చెకప్‌కు వెళ్ళితే మొదటగా చేసేది బీపీ చెకప్. ఇక ఈ బీపీ ఆధారంగానే మనకు మిగతా టెస్టులుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాగా సాధారణంగా 120/80 బీపీ ఉంటే నార్మల్ బీపీ అంటారు. ఈ మెజర్‌మెంట్ కంటే ఎక్కువగా ఉన్నా.. […]

బీపీ ఇంతకన్నా ఎక్కువ ఉంటే చాలా ప్రమాదమట..!

Updated on: Apr 08, 2019 | 6:53 PM

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ప్రజలు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, ఉద్యోగ భారం, తదితర అంశాల వల్ల చాలామందికి బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం ఏదైనా హాస్పిటల్ కు జనరల్ చెకప్‌కు వెళ్ళితే మొదటగా చేసేది బీపీ చెకప్. ఇక ఈ బీపీ ఆధారంగానే మనకు మిగతా టెస్టులుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.

కాగా సాధారణంగా 120/80 బీపీ ఉంటే నార్మల్ బీపీ అంటారు. ఈ మెజర్‌మెంట్ కంటే ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ఆరోగ్య సమస్యలు తప్పవు. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేసుకోవాలి. అదేవిధంగా 140/90 కంటే ఎక్కువగా ఉంటే హైబీపీ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. బీపీ ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. బీపీ తక్కువగా ఉంటే కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉంటే.. హార్ట్ స్ట్రోక్స్ ఇతర సమస్యలు వస్తాయి.