Olive Oil: రోజుకు ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిన్‌ తీసుకుంటే ఎన్ని లాభాలో.. సహజ మాయిశ్చరైజింగ్‌..

|

Sep 05, 2022 | 1:59 PM

ఆలివ్‌నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వనకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఒక స్పూన్‌ ఆలివ్‌నూనె ఆహారంలో భాగంగా తీసుకుంటే..

Olive Oil: రోజుకు ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిన్‌ తీసుకుంటే ఎన్ని లాభాలో.. సహజ మాయిశ్చరైజింగ్‌..
Olive Oil
Follow us on

Benefits of drinking olive oil: ఆలివ్‌నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వనకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఒక స్పూన్‌ ఆలివ్‌నూనె ఆహారంలో భాగంగా తీసుకుంటే కుంగుబాటు, ఆందోళన, ఊపిరితిత్తుల వ్యాధులు, రొమ్ము క్యాన్సర్‌, మెనోపాజ్‌ తర్వాత అల్జీమర్స్‌ వ్యాధి దరిచేరకుండా నివారిచడంలో సహాయపడుతుంది. రక్తనాళాల పనితీరును కూడా మెరుగుపరుస్తుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆలివ్‌నూనెలో పాలీఫినాల్స్‌, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేసి, రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఆరోగ్యానికేకాకుండా చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది.

ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, స్క్వాలేన్‌లతో పోరాడి, చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. సెబమ్ ఉత్పత్తిని అదుపులో ఉంచి, చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. ఆలివ్ నూనెలోని సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలు గోర్లు ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా ఆలివ్ నూనెలో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఈ నూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వెంట్రుకలను మృదువుగా మర్చి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఆలివ్ నూనెను కాస్త వేడి చేసి, తలపై కుదుళ్లకు మసాజ్‌ చేసుకుంటే జుట్టు బలంగా మారుతుంది.