Health Problems: చాలా మంది వివిధ కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉంటారు. దాంపత్య జీవితంలో అతి ముఖ్యమైనది ఇద్దరి కలయిక. ఇతర కలమాలు, బీజీ లైఫ్, చిన్నపాటి గొడవలు తదితర కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉంటారు. అలాంటి సమయంలో భార్యాభర్తలిద్దరి మధ్య దూరం మరింతగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కారణాలు ఏమైనా దూరంగా ఉండటం శరీరంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మానసికోల్లాసం పొందవచ్చు. సాధారణంగా చేసే వ్యాయమం కంటే శృంగారం చేస్తే ఎక్కువ వ్యాయమంలా ఉంటుందట.
గుండెపై ప్రభావం..
దంపతులిద్దరూ ఎక్కువ రోజులు శృంగారంలో పాల్గొనకపోతే మీ గుండెకు మంచిది కాదంటున్నారు. ఇద్దరి కలయికలో ఎక్కువ రోజులు గ్యాప్ రావడం వల్ల గుండెకు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పలు పరిశోధనలలో వెల్లడైనట్లు నిపుణులు వివరిస్తున్నారు. శరీరంలో ఎక్కువ కేలరీలను ఖర్చు చేయడానికి అద్బుతమైన మార్గం. అలాగే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల మధ్య సమతుల్యతను పెంపొందించడంలోనూ శృంగారం ఎంతగానో సహాయపడుతుందని, దీని ద్వారా గుండె జబ్బుల నుంచి కాపాడుకోవచ్చు.
ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది
అయితే సంభోగ సమయంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదల అవుతాయి. శృంగారంకు దూరంగా ఉన్నప్పుడు మీ శరీరం ఈ హర్మోన్స్ తక్కువగా విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడిని ఎదుర్కొవడం కష్టతరం అవుతుంది. ఆందోళన మరింతగా పెరుగుతుంది.
జ్ఞాపకశక్తి సమస్యలు
భార్యభార్తలిద్దరూ కలయికకు దూరంగా ఉండటం వల్ల మతిమరుపుతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. జ్ఞాపకశక్తి సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాల ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందట. ముఖ్యంగా 50 నుంచి 90 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణుల అధ్యాయనాల్లో తేలింది. ఇద్దరు చాలా రోజుల పాటు దూరంగా ఉండటం వల్ల జలుబు, ఫ్లూజ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. రెగ్యులర్‌గా కలుసుకుంటే ఇమ్యునోగ్లోబులిన్-ఏ అనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయట. దీని ద్వారా ఏదైనా వ్యాధులు వచ్చిన సమయంలో తట్టుకునే సామర్థ్యం మీ శరీరం పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.
ఒంటి నొప్పులు దూరం..
తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల ఒంటి నొప్పులు సైతం దూరం అవుతాయి. సంభోగం సమయంలో ఎండార్ఫిన్లు, ఇతర హన్మోన్లు అధికంగా విడుదల కావడం వల్ల తల, వెన్ను, కాళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే శృంగారం అనేది ఆరోగ్యానికి మంచిదేన్నది వాస్తవం. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే శృంగారం ఒక్కటే మార్గమని అనుకోవద్దు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి