రక్తహీనత అనేది ఒక సాధారణ సమస్య. చాలా సందర్భాలలో ఇది స్త్రీలను, పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం వలన అలసట, బలహీనత, తల తిరగడం, తలనొప్పి, చర్మం రంగు మారడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే.. అప్పుడు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని బాబా రాందేవ్ చూపించాడు. ఆయన చెప్పిన విధంగా హిమోగ్లోబిన్ పెంచడానికి సహజంగా లేదా ఆయుర్వేద పద్ధతులను అవలంబించాలి. తద్వారా శరీరానికి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పూర్తి పోషకాహారం లభిస్తుంది.
బాబా రామ్‌దేవ్ ఒక వీడియోలో హిమోగ్లోబిన్ పెంచడానికి ఒక గొప్ప సహజ నివారణ గురించి కూడా చెప్పారు. దీన్ని కేవలం 7 రోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఆ వంటకం ఏమిటో.. దాని ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.
బాబా రామ్‌దేవ్ దీనిని హిమోగ్లోబిన్ పెంచడానికి అద్భుతమైన జ్యూస్ గా అభివర్ణించారు. ఈ జ్యూస్ తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం మీకు దానిమ్మ, బీట్‌రూట్, అల్లం, ఉసిరి మాత్రమే అవసరం.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
ముందుగా దానిమ్మ గింజలు తీసి.. తర్వాత క్యారెట్, బీట్‌రూట్, ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. అల్లం తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ లో వేసి.. కొంచెం నీళ్లు పోసి బాగా కలపండి. జ్యూస్ బాగా తయారైన తర్వాత.. దానిని వడకట్టి ఒక గ్లాసులో పోయాలి. అందులో నిమ్మరసం పిండి వెంటనే త్రాగాలి. మీకు కావాలంటే.. మీరు దానిని వడకట్టకుండానే త్రాగవచ్చు. తద్వారా శరీరం దానిలోని ఫైబర్‌ను కూడా పొందుతుంది.
బాబా రామ్‌దేవ్ ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ని తాగడం వల్ల చాలా త్వరగా ప్రయోజనం కనిపిస్తుందని చెప్పారు. కనీసం 7 నుంచి 10 రోజుల పాటు క్రమం తప్పకుండా త్రాగండి. అప్పుడు దాని ప్రభావం మీకే తెలుస్తుంది. ఎవరైనా హిమోగ్లోబిన్ లేదని ఆందోళన చెందుతుంటే.. రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..