Health: గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగండి.. మార్పు మాములుగా ఉండదు

|

Sep 30, 2024 | 2:47 PM

పసుపులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పసుపును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటుంటాం. ప్రతీ కూరలో కచ్చితంగా పసుపు వేయాల్సిందే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దెబ్బ తగిలిన వెంటనే పెద్దలు పసుపు రాయమని సలహాలిస్తుంటారు...

Health: గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగండి.. మార్పు మాములుగా ఉండదు
Turmeric Water
Follow us on

పసుపులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పసుపును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటుంటాం. ప్రతీ కూరలో కచ్చితంగా పసుపు వేయాల్సిందే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దెబ్బ తగిలిన వెంటనే పెద్దలు పసుపు రాయమని సలహాలిస్తుంటారు. ఇంతటి మేలు చేసే పసుపును రోజూ ఉదయం పరగడుపు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా గోరువెచ్చని నీళ్లలో పసుపు కలుపుకొని తాగడం వల్ల అనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకుంటే ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా రోజు క్రమంతప్పకుండా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని చడు కొలెస్ట్రాల్‌ ఇట్టే కరిగిపోతుంది.

దీంతో శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. పసుపు నీరును క్రమంతప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా శుభ్రపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ అంశాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజు ఈ నీటిని తీసుకుంటే.. వైరస్‌లు, ఇన్ఫెక్షన్లన నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరగువుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలన్నీ బలదూర్‌ అవుతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. ఊబకాయంతో ఇబ్బంది పడేవారు కూడా పసుపు నీటిని తీసుకుంటే మేలు జరుగుతుంది. దీంతో శరీరంలో మెటబాలిక్ రేటు పెరిగి వేగంగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..