Capsicum Benefits: క్యాప్సికమ్ తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా..? తప్పక తెలుసుకోండి..

క్యాప్సికం లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ యూరిక్ యాసిడ్ ను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

Capsicum Benefits: క్యాప్సికమ్ తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా..?  తప్పక తెలుసుకోండి..
Capsicum

Updated on: Dec 05, 2024 | 9:30 PM

క్యాప్సికం తినాలంటే.. చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, క్యాప్సికమ్‌లో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. క్యాప్సికమ్‌ తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

క్యాప్సికమ్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను కూడా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ లో ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్యాప్సికం లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ యూరిక్ యాసిడ్ ను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

కంటి ఆరోగ్యానికి క్యాప్సికమ్ ఎక్కువగా పనిచేస్తుంది. క్యాప్సికమ్ లో లుటిన్, జియాక్సంతిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికంలో ఉంటే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు రే చీకటి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. క్యాప్సికం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికం తమ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us