Hair Fall Control Tips: జుట్టు రాలే సమస్యకు చిట్కాలు.. ఇంట్లో తయారు చేసుకున్న ఈ నూనెలతో అంతా సెట్‌..!

|

Feb 03, 2024 | 8:13 PM

జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు ఉసిరికాయలను తినవచ్చు. దీంతో హెయిర్ ఆయిల్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 2-3 ఉసిరికాయలు ముక్కలుగా చేసుకుని ఎండలో ఆరనివ్వాలి. ఒకటి నుండి రెండు గంటల వరకు సూర్యకాంతిలో ఆరిన తర్వాత గ్యాస్ మీద ఒక కడాయ్‌ పెట్టి సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె తీసుకుని వేడిచేయండి. ఇందులోనే ఉసిరి కాయ ముక్కలు కూడా వేయాలి.

Hair Fall Control Tips: జుట్టు రాలే సమస్యకు చిట్కాలు.. ఇంట్లో తయారు చేసుకున్న ఈ నూనెలతో అంతా సెట్‌..!
Hair Fall Home Remedies
Follow us on

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం, గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. అందులోనూ జుట్టు రాలడం సమస్య సాధారణంగా మారింది. కానీ చిన్న వయసులో జుట్టు రాలడం మంచిది కాదు. ఇది మీ మొత్తం వ్యక్తిత్వాన్ని, రూపాన్ని పాడు చేస్తుంది. జుట్టు రాలడం సమస్యకు సకాలంలో చికిత్స చేయడం మంచిది. నైపుణ్యం కలిగిన హెయిర్ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. మీ జుట్టు రాలడం సమస్య గురించి చెప్పండి. అలాగే, మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. చాలా సార్లు, మురికిగా ఉన్న స్కాల్ప్ కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. జుట్టుకు నూనె వేయకపోవడం, షాంపూ చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం, శరీరంలో పోషకాలు లేకపోవడం వంటివి దీనికి కారణం.

జుట్టుకు తగినన్ని పోషకాలను అందించడానికి హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా ముఖ్యం. అయితే, ఇందుకోసం కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె ఉపయోగిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. ఈ నూనెలను జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ నూనెలు రాసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుంటే ఇంట్లోనే కొన్ని నూనెలు సిద్ధం చేసుకుని నెలకో, రెండు నెలలకో రాసుకోవచ్చు. ఈ నూనెలన్నీ సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి కాబట్టి జుట్టుకు పెద్దగా నష్టం వాటిల్లదు. సహజ నూనెలు జుట్టు రాలడాన్ని ఆపుతాయి. ఈ రోజు మనం కొన్ని హెయిర్ ఆయిల్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాంం. వాటిని అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను చాలా వరకు పరిష్కరించుకోవచ్చు.

ఇంట్లో అలోవెరా జెల్ నుండి నూనెను తయారు చేయడం..

ఇవి కూడా చదవండి

కలబందను జుట్టుకు విస్తృతంగా ఉపయోగిస్తారు. అలోవెరా జెల్‌ని జుట్టుకు అప్లై చేయాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలోవెరా జెల్ జుట్టుకు పోషణనిచ్చే అమినో యాసిడ్లను కలిగి ఉంటుంది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలోవెరా జెల్ నుండి హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి, మీకు కొంత అలోవెరా జెల్, కొబ్బరి నూనె అవసరం. ఈ రెండింటినీ ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. కొబ్బరినూనెలో కలబంద జెల్ కరిగిపోయాక స్టవ్ మీద నుంచి దించాలి. ఇప్పుడు కొన్ని చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని సీసాలో ఉంచి ఈ నూనెతో మీ జుట్టుకు వారానికి రెండు మూడు సార్లు మసాజ్ చేయండి.

ఉసిరి నూనెను ఇంట్లో తయారు చేసుకుని..

ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు ఉసిరికాయలను తినవచ్చు. దీంతో హెయిర్ ఆయిల్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 2-3 ఉసిరికాయలు ముక్కలుగా చేసుకుని ఎండలో ఆరనివ్వాలి. ఒకటి నుండి రెండు గంటల వరకు సూర్యకాంతిలో ఆరిన తర్వాత గ్యాస్ మీద ఒక కడాయ్‌ పెట్టి సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె తీసుకుని వేడిచేయండి. ఇందులోనే ఉసిరి కాయ ముక్కలు కూడా వేయాలి. కాసేపు ఉడికించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని నూనెను చల్లబరచండి. చల్లారిన తర్వాత ఉసిరిని బాగా గ్రైండ్ చేసి నూనెను వడగట్టి సీసాలో పెట్టుకోవాలి. దీన్ని మీ జుట్టుకు వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయండి.

ఇంట్లో ఉల్లిపాయ నూనెను తయారు చెసుకోవచ్చు..

ఉల్లిపాయ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయలలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది, ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. దీంతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు దానికి సమానంగా ఒక కప్పు కొబ్బరి నూనె కలపండి. దానిని వేడి చేసుకోవాలి. దీన్ని బాగా ఉడికించాలి. ఆ తర్వాత నూనె చల్లబరుచుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసి బాటిల్‌లో స్టోర్‌ చేసుకోండి. దీనికి మీకు ఇష్టమైన ముఖ్యమైన నూనెను కొన్ని చుక్కలు కలుపుకుని వారానికి రెండు మూడు సార్లు మీ తలకు మసాజ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..