3 / 5
గుడ్డు- అలోవెరా: చిట్లిన జుట్టుకు గుడ్డులో కలబంద జెల్‌ను కలిపి అప్లై చేయవచ్చు. కలబంద జుట్టును హైడ్రేట్ చేస్తుంది. మృదువుగా చేస్తుంది. అదే విధంగా గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కనుక ఇది జుట్టుకు మెరుపును తీసుకురావడానికి, చిట్లిన జుట్టును సరిచేయడంలో సహాయపడుతుంది. గుడ్డు, కలబంద హెయిర్ మాస్క్‌ని ప్రతి వారం అప్లై చేయడం వల్ల జుట్టు సహజంగా మెరుస్తుంది. అంతేకాదు జుట్టు చిట్లడం, రాలడం కూడా తగ్గుతుంది.