Hair Care: ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలిపోతుందా..? అయితే ఈ హోం రెమెడీస్ మీ కోసమే..

|

Oct 26, 2021 | 9:39 PM

Hair Care Tips: ప్రసవం తర్వాత మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో జుట్టు రాలడం కూడా ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. కొన్ని ఇంటి చిట్కాలతో మీరు జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

1 / 5
ఆహారం: మీరు తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రాబెర్రీలు, యాపిల్స్, బీన్స్, రేగు పండ్లను తినవచ్చు. యాంటీఆక్సిడెంట్లు జట్టు మూలాలు బలోపేతం అయ్యేలా సహాయపడతాయి.

2 / 5
స్కాల్ప్, హెయిర్‌ను క్లీన్‌గా ఉంచాలి: మీ స్కాల్ప్‌ను తేలికపాటి యాంటీ హెయిర్ లాస్ షాంపూతో శుభ్రంగా కడగాలి. మీ జుట్టు రాలిపోకుండా ఉండేందుకు కండిషన్ చేయాలి. ఇదంతా చేసేందుకు సమయం తక్కువగా ఉంటే... లీవ్-ఇన్ కండీషనర్‌ను ఉపయోగించాలి.

3 / 5
జట్టును బలంగా కట్టడం మానుకోండి: మీ జుట్టును గట్టిగా లాగడం, కట్టడం లాంటివి మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ తలపైనున్న జుట్టుపై ఒత్తిడి కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జుట్టు రాలిపోతుంది.

4 / 5
విటమిన్ సప్లిమెంట్స్: గర్భధారణ తర్వాత మీ శరీరానికి కొన్ని సప్లిమెంట్లు అవసరం. అవి మీకు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీరు విటమిన్ బి, సి వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి.

5 / 5
రంగు వేయొద్దు్: మీ జుట్టుకు రంగులు వేయడం, స్ట్రెయిట్ చేయడం, పెర్మ్ చేయడం వంటివి మానుకోవాలి. ఎందుకంటే ఇవి జుట్టు రాలడానికి దారితీస్తాయి. అవసరమైన సందర్భాల్లో తప్ప ఇలా అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..