
మగువలు పొడవాటి, దట్టమైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు, చుండ్రు వంటి వివిధ సమస్యల కారణంగా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. ఏం చేసినా జుట్టు రాలడం ఆగట్లేదని బాధపడేవారికి నిపుణులు గొప్ప చిట్కా చెబుతున్నారు. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం ఎంతో ప్రయోజనకంగా ఉంటుందని సూచిస్తున్నారు. దీనిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..
జుట్టు రాలడాన్ని నివారించడానికి హెయిర్ నూనె లేదా ఇతర ఉత్పత్తులకు బదులుగా వంటలో కీలకమైన ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి జుట్టుకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు మసాజ్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా, వ్యర్థంగా పారవేసే ఉల్లిపాయ తొక్కలు కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీనిని జుట్టుకు అప్లై చేస్తే, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
తాజా ఉల్లిపాయలను మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని పల్చటి గుడ్డ తీసుకుని వడకట్టాలి. ఉల్లి రసం వాసన ఘాటుగా ఉండాలి. దీనిని జుట్టుకు అప్లై చేస్తే 99 శాతం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.