తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయోజనాలు.. శీతాకాలంలో ఈ పండును రోజూ తింటే.. ఎన్ని లాభాలో!

Guava Benefits: శీతాకాలం వచ్చిందంటే చాలా మార్కెట్‌లో కాలానుగుణ పండ్లుతో పాటు కూరగాయలు ఎక్కవగా కనిపిస్తుంటాయి. ఈ కాలనుగుణ పండ్లు రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఫిట్‌నెస్ నిపుణులు సైతం సప్లిమెంట్స్ వదిలేసి పండ్లు తినమని సలహా ఇస్తారు. తాజాగా సిద్ధార్థ్ తివారీ అనే ఫిట్‌నెస్ కోచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పండు శీతాకాలంలో మనకు "అత్యంత ప్రయోజనకరమైనదిని పేర్కొన్నాడు. అదేంటో చూద్దాం పదండి

తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయోజనాలు.. శీతాకాలంలో ఈ పండును రోజూ తింటే.. ఎన్ని లాభాలో!
Guava Benefits

Updated on: Dec 23, 2025 | 6:30 AM

తరచూ మార్కెట్‌లో రకరకరాల పండ్లు మనకు కనిపిస్తాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో జామ పండు కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అమెరికన్ హెల్త్ వెబ్‌సైట్ WebMD ప్రకారం, జామపండు అత్యంత ప్రోటీన్ కలిగిన పండ్లలో ఒకటి. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం, 5 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, జామపండు రూపంలో ఇవన్నీ కేవలం మనకు రూ.10 కంటే తక్కువ ధరకే అభిస్తాయి.

బడ్జెట్‌లో ఆరోగ్యంగాన్ని మెరుగుపర్చుకునేందుకు గొప్ప ఎంపిక

ఫిట్‌నెస్ కోచ్ సిద్ధార్థ్ ప్రకారం.. జామపండుకు ఉన్న కొన్ని లక్షణాలతో అది మిగతా పండ్లతో పోల్చుకుంటే అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
అన్ని పండ్లు పోషకమైనవి అయినప్పటికీ శీతాకాంలో జామపండును మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని ఆయన చెబుతున్నారు. మీరోజు వారి ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల మీరు తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన అన్నారు.

ఇతర పండ్ల కంటే జామ ఎలా మంచిది?

ఒక 100–150 గ్రాములు జామ పండులో నారింజ కంటే ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం, 5.4 గ్రాముల ఫైబర్ (ఇతర పండ్ల కంటే దాదాపు రెట్టింపు), 3 గ్రాముల ప్రోటీన్ (ఇది పండ్లలో చాలా అరుదు), 70 కేలరీలను అందిస్తుంది. దీంతో పాటు మిగతా పండ్లతో పోలిస్తే దీని ధర కూడా చాలా తక్కువ.. ఈ పండును మనం కేవలం రూ. 10కే కొనుగోలు చేయవచ్చు. మీరు మీ రోజువారి ఆహారంలో ఈ పండును చేర్చుకోవడం ద్వారా తక్కువ ఖచ్చుతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

మీరు ఈ పండును ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే, మీరు దానిని మీ ఉదయం స్మూతీలలో తీసుకోవచ్చు. లేదా ఓట్‌మీల్‌పై గార్నీష్‌లా తీసుకొవచ్చు, లేదా స్నాక్‌గా తినవచ్చు.. శీతాకాలంలో మీరు ఈ పండును ఏ విధంగా తిన్నా.. మీరు దాని ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.