Oral Hygiene: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలతో వెంటనే చెక్ పెట్టొచ్చు..

|

Nov 29, 2022 | 8:16 PM

చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి ఇబ్బందులు పడుతుంటారు. నోటి నుంచి వచ్చే దుర్వాసన వ్యక్తిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

Oral Hygiene: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలతో వెంటనే చెక్ పెట్టొచ్చు..
Bad Breath
Follow us on

Get rid of bad breath: చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి ఇబ్బందులు పడుతుంటారు. నోటి నుంచి వచ్చే దుర్వాసన వ్యక్తిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నోటి దుర్వాసనకు కొన్ని అంతర్గత సమస్యలు, జబ్బులు కూడా కారణమవుతాయి. సాధారణంగా నోటి పరిశుభ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం. నోటి దుర్వాసనను తొలగించడం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. వ్యక్తిత్వానికి కూడా మంచిది. నోటి నుంచి వచ్చే చెడు వాసన.. దంతాల లోపల ఆహారం కుళ్ళిపోయే సమస్యను, అలాగే వివిధ గమ్ వ్యాధులను సూచిస్తుంది. ఇంకా నోటి దుర్వాసన.. వివిధ అంతర్లీన వ్యాధులతో కూడా బయటకు రావచ్చు. ఉదాహరణకు గొంతు ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ అల్సర్లు, గుండెల్లో మంట, లాక్టోస్ వంటి కడుపు సమస్యల వస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే.. నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఇవి పాటిస్తే నోటి దుర్వాసన పోతుంది.

  1. రెండుసార్లు బ్రష్ చేయండి: దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని సిఫార్సు చేస్తారు. దంతాల ఉపరితలాన్ని శుభ్రం చేయడానికి సరైన బ్రషింగ్ టెక్నిక్ కూడా తెలుసుకోవాలి. అవును, దంతాల ఉపరితలం మాత్రమే కాకుండా, గమ్ లైన్, మీ దంతాల వెనుక భాగాన్ని కూడా బ్రష్ చేయాలి. బ్రష్ చేయడమే కాకుండా.. నాలుకను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
  2. ఫ్లాసింగ్ తప్పనిసరి: బ్రష్ చేయడంతో పాటు ఫ్లాసింగ్ (పుక్కిలించడం) కూడా ముఖ్యం. ఎందుకంటే బ్రష్ దంతాల ఇరుకైన ఖాళీలను చేరుకోలేదు. అందువల్ల రోజువారీ బ్రష్‌తో పాటు ఫ్లాసింగ్ చేయడం వల్ల దంతాల మధ్య ఇరుక్కున్న బ్యాక్టీరియా, ఆహారాన్ని తొలగించవచ్చు. దంతాల మధ్య పేరుకుపోయిన ఆహారం, అది ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా వల్ల నోటి దుర్వాసన వస్తుంది.
  3. నోరు పొడిగా ఉంచకండి: లాలాజలం నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. నోటిలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోయినప్పుడు హాలిటోసిస్ లేదా దుర్వాసన వస్తుంది. నిజానికి నోటిలోని బ్యాక్టీరియా యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాసిడ్ పళ్లను ప్రభావితం చేస్తుంది. దీంతో నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, లాలాజలం ఈ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. లాలాజల స్థాయిలను సాధారణంగా ఉంచడానికి షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ని క్రమం తప్పకుండా నమలండి. ఇలా చేస్తే నోరు పొడిబారదు.
  4. ధూమపానం – పొగాకు వినియోగం మానేయండి: ధూమపానం, పొగాకు వినియోగ అలవాట్లు దంతాలకు భయంకరమైన నష్టాన్ని కలిగిస్తాయి. పొగాకు దంతాల నాణ్యతను నాశనం చేస్తుంది. దీంతో నోటి నుంచి కూడా భయంకరమైన వాసన వస్తుంది. పొగాకు వాడకం వల్ల, నోటి కుహరంలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో దుర్వాసన వస్తుంది.
  5. నీరు తాగండి: ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు తాగాలి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల నోటిలో ఆమ్లం, క్షార సమతుల్యత లోపిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన కూడా వస్తుంది. అప్పుడప్పుడు నీళ్లు తాగడం వల్ల నోటిలో ఇరుక్కున్న ఆహారం కూడా నీటితో పాటు కడుపులోకి వెళ్లిపోతుంది. దీంతో నోరు శుభ్రంగా ఉండటంతోపాటు బాక్టీరియా పెరుగుదల ఆగిపోతుంది. అలాగే, తీపి, టీ వంటి ఆహారాన్ని తిన్న పది, పదిహేను నిమిషాల తర్వాత నోటిని పుక్కిలించాలి.
  6. ఆరోగ్యకరమైన ఆహారం: అనారోగ్యకరమైన ఆహారం అనేక వ్యాధులకు మూల కారణం. చిప్స్, స్వీట్లు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినే అలవాటు ఆరోగ్యానికి హానికరం. ఇంకా నోటి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. కావున రెగ్యులర్ గా హెల్తీ ఫుడ్ తీసుకోవడంపై దృష్టి పెట్టండి. మీ ఆహారంలో కాలానుగుణ పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. ఎందుకంటే కూరగాయలు, పండ్లలో వివిధ రకాల వ్యాధులను నిరోధించే విటమిన్లు, ఖనిజాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
  7. విటమిన్ సి: విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తినండి. అటువంటి పండ్లలో ఉండే విటమిన్ సి నోటి ఆరోగ్యాన్ని పెంచి.. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..