Kitchen Tips: కుస్తీలు పడే పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!

Updated on: Sep 27, 2026 | 7:18 PM

ఇంట్లో మహిళలకు చికాకు తెప్పించే పనేదైనా ఉందంటే.. అది వంటగది క్లీన్ చేయడం. అందులో ముఖ్యంగా స్టవ్‌పై పేరుకుపోయిన మొండి మరకలు. నిత్యం వంట చేయడం వల్ల స్టవ్‌పై నూనె, మసాలా, పాల మరకలు అలాగే ఉండిపోతాయి. ఈ మొండి మరకలను పోగొట్టేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల రసాయనాలను వాడుతూ ఉంటారు. కానీ ఎన్ని సార్లు రుద్దినా అవి అస్సలు పోవు. ఈ క్రమంలో మన ఇంట్లోనే దొరికే కొన్ని వస్తువులతో ఈ మరకలను క్షణాల్లో పోగొట్టవచ్చు.. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
మనం రోజూ వంటచేసేటప్పుడు పొరపాటున కూరలు, లేదా టీ, పాలు పొంగిపోయి.. స్టవ్‌పై మరకలు ఏర్పడతాయి. వాటిని అలాగే వదిలేస్తే.. అవి ఎండిపోయి స్టవ్‌కు అతుక్కుపోతాయి. అలాంటి సందర్భంలో వాటిని శుభ్రం చేయడం చాలా కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు గ్యాస్ బర్నర్‌లపై పడిన మరకల కారణంగా వాటి రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్యాస్ వేస్ట్ అవ్వడం, బర్నర్ సరిగా మండకపోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం.

2 / 5
అయితే వాటిని క్లీన్ చేయడానికి జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల రసాయనాలు, డిష్ వాష్‌లను వాడుతూ ఉంటారు. కానీ మీకు కొన్ని చిట్కాలు తెలిస్తే.. ఆ మొండి మరకలను శ్రమలేకుండా క్షణాల్లో మాయం చేయవచ్చు. ఇందుకోసం ముందుగా గ్యాస్‌పై ఉన్న బర్నర్లను, వాటి సపోర్ట్ స్టాండ్‌లను బయటకు తీసి.. వేడి నీటిలో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి నానబెట్టండి. 20 నిమిషాల తర్వాత వాటిని తీసి స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రమైన నీటిలో కడగండి. బర్నర్లు మరీ జిగటగా అనిపిస్తే నీటిలో కొంచెం బేకింగ్ సోడాను కూడా యాడ్ చేయండి. ఇది మొండి మరకలను వదిలించడంలో బాగా పనిచేస్తుంది.

3 / 5
మొండి మరకలను తొలగించే మరో మార్గం వెనిగర్. ఇందుకోసం మీరు ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకొని అందులో కొంతమేర వెనిగర్ యాడ్ చేయండి. దాన్ని బాగా కలిపి అందులో జిడ్డు పేరుకుపోయిన బర్నర్‌ను వేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచితే.. బర్నర్‌కు ఉన్న జిడ్డు మొత్తం వదిలిపోతుంది. ఆ తర్వాత, దానిని బాగా రుద్ది కడగండి. పూర్తిగా శుభ్రంగా కడిగిన తర్వాత దానిని పొడి క్లాత్‌తో తుడిచి వాడుకోండి.

4 / 5
ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు బర్నర్ రంధ్రాల్లోని మురికి అలానే ఉంటుంది. ఇందుకోసం మీరు వాడకుండా ఉంచిన పాత టూత్‌బ్రష్‌ను తీసుకొని.. నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపిన పేస్ట్‌తో బర్నర్ రంధ్రాలను బాగా రుద్దండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో బర్నర్‌ను క్లీన్ చేసి.. దానిని పొడి గుడ్డతో తడిలేకుండా తుడవండి. ఇలా చేస్తే క్షణాల్లో మూసుకుపోయిన రంధ్రాలు క్లీన్ అవుతాయి. నిమ్మకాయలో ఉండే శక్తివంతమైన గుణాలు మొండి మరకలను ఈజీగా తొలగిస్తాయి.

5 / 5
అయితే చివరగా మీరు ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. బర్నర్లను శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నవాటిని ఎప్పుడూ గ్యాస్ స్టవ్‌పై పెట్టకూడదు. వాటిని నీటిలో శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా నీరు లేకుండా ఆరనివ్వండి. వాటిని పొడి గుడ్డతో తుడవండి.. అవసరమైతే కాసేపు ఎండలో ఉంచి.. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే వాటిని స్టవ్‌పై పెట్టి ఉపయోగించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us