ఈ సింపుల్ చిట్కాలతో చేతులకు ఉన్న చేపల వాసన క్షణాలో పోగొట్టండి

 27 Sep 2026

Anand T

చేపలు తినడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. కానీ వాటిని శుభ్రం చేసిన తర్వాత చేతుల వచ్చే స్మెల్ చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది.కానీ మీకు కొన్ని చిట్కాలు తెలిస్తే ఈ వాసనను ఈజీగా వదిలించుకోవచ్చు.

నీచు వాసన

మీ చేతులకు ఉన్న నీచు వాసన పోవాలంటే చేపలు కడిగిన తర్వాత, చేతులను చల్లటి నీటిలో ముంచి స్టీల్ పాత్రపై బాగా రుద్దండి. క్షణాల్లో స్మెల్ పోతుంది.

స్టీల్ పాత్ర..

అలా పోకపోతే చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసి బాగా రుద్ది, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోండి ఇలా చేస్తే కూడా వాసన పోతుంది.

నిమ్మకాయ

మన చికెన్‌లో దొరికే ఉప్పు, వెనిగర్ కలిపి చేతులకు రుద్ది కడుక్కుంటే కూడా చేతులకు ఉన్న నీచు వాసన తొలగిపోతుంది.

ఉప్పు, వెనిగర్..

అలాగే మీ ఇంట్లో బ్రూ ఉంటే.. దాన్ని  కొద్దిగా చేతులకు రుద్దుకొని బాగా రుద్ది కడుక్కుంటే వాసన ఇట్టే మాయం అవుతుంది.

కాఫీ పొడి

చింతపండు ద్వారా కూడా మీరు చేతులకు ఉన్న నీచు వాసనను పొగొట్టొచ్చు.  ఇందుకోసం చింతపండును నానబెట్టి.. దానితో చేతులను బాగా కడుక్కోండి.  

చింతపండు

మనం పళ్లు రుద్దేందుకు వాడే టూత్‌ పేస్ట్‌తో కూడా నీచు వాసన పొగొట్టొచ్చు. ఇందుకోసం పేస్ట్‌ చేతులకు బాగా రుద్ది నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

టూత్ పేస్ట్

చేతులను సబ్బుతో కడిగిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె రాసి తుడుచుకోవడం ద్వారా కూడా మీ చేతులకు ఉన్న నీచు వాసన పొగొట్టవచ్చు.

కొబ్బరి నూనె