Garlic Good Antidote : పంటి నొప్పికి వెల్లుల్లి మంచి విరుగుడు..! ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

|

Jun 23, 2021 | 9:43 PM

Garlic Good Antidote : పంటి నొప్పితో చాలామంది అవస్థ పడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు.

Garlic Good Antidote : పంటి నొప్పికి వెల్లుల్లి మంచి విరుగుడు..! ఇలా చేస్తే క్షణాల్లో మాయం..
Garlic Good Antidote
Follow us on

Garlic Good Antidote : పంటి నొప్పితో చాలామంది అవస్థ పడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. రోజుల తరబడి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి సమయంలో మనం ఇంట్లో వాడే వెల్లుల్లి చక్కగా పనిచేస్తుంది. ఇది హానికారక బ్యాక్టీరియాని చంపడమే కాక పెయిన్‌ రిలీవర్‌గా కూడా పని చేస్తుంది. ఓ వెల్లుల్లి రెమ్మని పేస్ట్‌ చేసి ఆ పేస్ట్‌ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఈ పేస్ట్‌కి కొద్దిగా ఉప్పు కూడా యాడ్‌ చేయవచ్చు. లేదంటే తాజా వెల్లుల్లి రెమ్మని నెమ్మదిగా నమిలినా కూడా సరిపోతుంది. వెంటనే నొప్పి మాయమవుతుంది.

ఇదికాకుండా.. పంటి నొప్పికి లవంగాలు వాడడం అనేది కూడా మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. ఇలా చేయడానికి ఒక కాటన్ బాల్ మీద కొద్దిగా లవంగ నూనె తీసుకుని దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఈ లవంగనూనెని కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్, లేదా నీటితో డైల్యూట్ చేసి వాడండి. ఇలా రోజుకి కొన్ని సార్లు చేయవచ్చు. ఒక చిన్న గ్లాసు నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె వేసి మౌత్ వాష్ లాగా ఉపయోగించవచ్చు. పంటినొప్పిని ఉప్పు నీటితో మౌత్ వాష్ చేసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది.

నాచురల్ డిస్ఇంఫెక్టెంట్ అయిన సాల్ట్ వాటర్ పళ్ళ మధ్య ఇరుక్కుని ఉండిపోయిన ఆహార పదార్థాలని బయటకి లాగేస్తుంది. పంటినొప్పిని ఉప్పు నీటితో ట్రీట్ చేయడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అయ్యి ఇంకేవైనా చిన్న చిన్న నోటి పుండ్లు ఉంటే కూడా తగ్గిపోతాయి. ఇలా చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని మౌత్ వాష్‌లా ఉపయోగించండి.

Threat With Salt : ఉప్పుతో పెద్ద ముప్పు..! ఇమ్యూనిటీ పెరగడానికి అడ్డు పడుతుందా..? ఒక వ్యక్తి రోజు ఎంత ఉప్పు తీసుకోవాలి..

Vijayasai Reddy : అక్కడ ధృతరాష్ట్రుని పాత్ర పోషించావా? వాటాలు తీసుకుని ఊరుకున్నావా.. అశోక్? : విజయసాయిరెడ్డి

Balram Naik disqualifies: కాంగ్రెస్ మాజీ మంత్రికి భారీ షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం